Kannappa Trailer: కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచేసిన వీడియో.. చూశారా..?
మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న లేటేస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప. ఇందులో అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను హాలీవుడ్ లెవల్ స్టాండర్డ్స్ తో తెరెక్కకించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కన్నప్ప. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. భారీ అంచనాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు. ఇందులో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా.. అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, మధుబాల, కాజల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అగ్ర హీరోలు ముఖ్య పాత్రలు పోషిస్తుండడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో తిన్నడు పాత్రలో విష్ణు, రుద్ర పాత్రలో ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించారు.
ట్రైలర్ చూస్తుంటే విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుటివరకు విడుదలైన పోస్టర్స్ కంటే ట్రైలర్ తోనే మరింత అంచనాలు పెంచేశారు మేకర్స్. మంచు విష్ణు, ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, తెలుగులో జూన్ 27న విడుదల చేయనున్నారు.
కన్నప్ప ట్రైలర్..
ఇవి కూడా చదవండి :
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..
Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..
