AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పెళ్లైన దర్శకుడిని పిచ్చిగా ప్రేమించింది.. కట్ చేస్తే.. 50 ఏళ్ల వయసులో ఒంటరిగా ఉన్న హీరోయిన్..

ఒకప్పుడు సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే చేసిన చిన్న చిన్న పొరపాట్లతో అవకాశాలు కోల్పోయిన హీరోయిన్ గురించి మీకు తెలుసా.. ? 50 ఏళ్ల వయసులోనూ ప్రేమ, పెళ్లికి దూరంగా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో నటిస్తూ మరోసారి వెండితెరపై సందడి చేస్తుంది.

Tollywood: పెళ్లైన దర్శకుడిని పిచ్చిగా ప్రేమించింది.. కట్ చేస్తే.. 50 ఏళ్ల వయసులో ఒంటరిగా ఉన్న హీరోయిన్..
Actress
Rajitha Chanti
|

Updated on: Jun 14, 2025 | 6:24 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గురించి అనేక రూమర్స్ రావడం సర్వసాధారణం. ముఖ్యంగా తారల ప్రేమ, పెళ్లి, వైవాహిక జీవితం గురించి అనేక విషయాలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంటాయి. ఇండస్ట్రీలోని చాలా మంది తారలు పెళ్లి, విడాకులు తీసుకుని ఆ తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటికీ ఒంటరిగా ఉండిపోయారు. సినీరంగంలో పెళ్లికి దూరంగా ఒంటరిగా ఉండిపోయిన హీరోయిన్స్ ఎవరో తెలుసా.. ? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు నటి. తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ కొన్నేళ్లుగా ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. అందుకు కారణం ఆమె ప్రేమ విచ్ఛిన్నమే. ఆమె మరెవరో కాదు.. అమీషా పటేల్. ఈరోజు ఆమె 50వ పుట్టినరోజు జరుపుకుంటుంది.

అమీషా పటేల్ తన కెరీర్‌ను బ్లాక్ బస్టర్ చిత్రంతో ప్రారంభించింది. కానీ సినిమాలతోపాటు వ్యక్తిగత జీవితం విషయంతోనే ఎక్కువగా వార్తలలో నిలిచింది. తెలుగులో మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ నాని సినిమాలో కనిపించింది. అలాగే తెలుగులో పలు చిత్రాల్లో మెరిసింది. అమీషా పటేల్.. ఇటీవలే పారిశ్రామికవేత్త నిర్వాణి బిర్లాతో తనకున్న సంబంధం గురించి వార్తలలో నిలిచింది. నిర్వాణతో దిగిన ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది.

ఇదిలా ఉంటే..అమీషా గతంలో ఒక పెళ్లైన దర్శకుడిని పిచ్చిగా ప్రేమించిందట. అతడి పేరు విక్రమ్ భట్. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అమీషా ఈ దర్శకుడిని ప్రేమించి తన కెరీర్ నాశనం చేసుకుందని ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం నడుస్తుంటుంది. వీరిద్దరు కొన్నాళ్లు ప్రేమలో ఉన్నారు. కానీ అదే సమయంలో వీరు విడిపోయినట్లు టాక్ నడిచింది. విక్రమ్ భట్ తో తన సంబంధం తన కెరీర్ ను నాశనం చేసిందని అమీషా పటేల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సంబంధం కారణంగా, ఆమె ఒక దశాబ్దానికి పైగా ప్రేమకు దూరంగా ఉండిపోయింది.

తన జీవితంలో ఒక వ్యక్తిని నిజాయితీగా ప్రేమించానని.. అది తన అతిపెద్ద బలహీనతగా మారిందని.. ఆ సంబంధం తన కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించిందని తెలిపింది. విక్రమ్ భట్ తో బ్రేకప్ తర్వాత 13 సంవత్సరాలు తన జీవితంలో మరో వ్యక్తికి స్థానం ఇవ్వలేదని.. తనకు ప్రశాంతత మాత్రమే ముఖ్యమని కోరుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

ఇవి కూడా చదవండి :  

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..

Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..

Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..