Telangana Gaddar Awards: గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవం.. ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్.. లైవ్ వీడియో
హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫిల్మ్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. దాంతో.. హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది. ఇప్పటికే.. పలువురు సినీ ప్రముఖులు హైటెక్స్‌కు చేరుకోగా.. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు.
హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫిల్మ్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. దాంతో.. హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది. ఇప్పటికే.. పలువురు సినీ ప్రముఖులు హైటెక్స్‌కు చేరుకోగా.. కాసేపట్లో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, సుకుమార్, నాగ్‌అశ్విన్ హాజరయ్యారు. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు.. పలువురు మంత్రులు హాజరయ్యారు. పదేళ్ల తర్వాత గద్దర్ పేరుతో ఫిల్మ్ అవార్డులు ఇవ్వనుండడంతో ఈ కార్యకమానికి ప్రభుత్వం తరపున పెద్దయెత్తున ప్రచారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.
ఇక.. ఇటీవల మురళీమోహన్ సారథ్యంలోని జ్యూరీ.. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలను, 2024 సంవత్సరానికి అన్ని విభాగాలకూ గద్దర్ అవార్డులను ప్రకటించింది. 2024కి గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ నటించిన కల్కి ఎంపికైంది. పుష్ప 2 చిత్రానికి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కి అవార్డ్ దక్కింది. 35-చిన్న కథ కాదు మూవీకి ఉత్తమ నటిగా నివేదాథామస్ ఎంపికయ్యారు.
ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీనటులతోపాటు వివిధ విభాగాలకు తెలంగాణ ప్రభుత్వం మొత్తం 73 గద్దర్ అవార్డులు అందించనుంది. ఒక్కో ఉత్తమ చిత్రానికి 10లక్షల రూపాయల నగదుతోపాటు మెమెంటో ఇవ్వనుంది. ద్వితీయ ఉత్తమ చిత్రానికి 7లక్షలు, తృతీయ ఉత్తమ చిత్రానికి 5లక్షల రూపాయలతోపాటు మెమెంటో అందించనుంది. మొత్తం 11 ఉత్తమ చిత్రాలకు గద్దర్ అవార్డుల ప్రదానం చేయనుంది.

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
