Mahesh Babu: చిన్నారికి ఉచితంగా గుండె సర్జరీ చేయించిన మహేష్ బాబు.. కృతజ్ఞతగా అభిమానులు ఏం చేశారో చూడండి.. వీడియో
తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు తలెత్తిన కొన్ని పరిస్థితుల కారణంగా గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్యం చేయించాలని మహేష్ నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచే తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేలాది మంది చిన్నారులకు ఉచితంగా గుండె సర్జరీలు చేయించాడు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాడు. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో పలు మంచి పనులు చేపడుతున్నాడీ సూపర్ స్టార్. ఇందులో భాగంగా ఇప్పటివరకు వేల మంది చిన్నారులకు ప్రాణం పోశాడు మహేష్. ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యంతో కలిసి వారికి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించాడు. తద్వారా పిల్లల తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపాడు. ఇటీవలే మరో చిన్నారికి ప్రాణం పోశాడీ సూపర్ స్టార్. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కత్తుల వారి పేటకు చెందిన రెండేళ్ల రిత్విక గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. పాప గుండెలో హోల్ ఉందని, చికిత్సకు లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు మహేష్ ఫ్యాన్స్ ను ఆశ్రయించారు. వారు ఈ విషయాన్ని ఎంబీ ఫౌండేషన్ కు తెలియజేయడంతో ఆ చిన్నారికి ఉచితంగా గుండె సర్జరీ చేయించాడు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల కళ్లలో ఆనందానికి అవధుల్లేవు. ఇందుకు కృతజ్ఞతగా కొన్ని రోజుల క్రితం కత్తుల వారి పేటలో మహేష్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అంతకు మించి అనేలా భారీ ప్లెక్సీ ఏర్పాటు చేశారు మహేష్ అభిమానులు.
ఈ ప్లెక్సీ లోనూ ‘నువ్వు కాపాడిన 3772 వ ప్రాణం సామీ మా పి గన్నవరం ది సామి. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు. మాకు నమ్మించే అక్కర లేదు. ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం’ అంటూ ఖలేజా సినిమాలోని డైలాగ్ తో భారీ ఫ్లెక్స్ ఏర్పాటు చేసారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు మహేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మహేష్ బాబు భారీ ప్లెక్సీ..
Okosari anipistadi nenu kuda east Godavari lo putti vunte bagundedi ani…Vella Fansim 🥹🥹♥️♥️💥💥🙏🙏#SSMB29 #MaheshBabu pic.twitter.com/gQVO2aceTU
— Nikhil_Prince🚲 (@Nikhil_Prince01) October 23, 2024
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ కనిపించనంత కొత్త లుక్ లో కనిపించనున్నాడీ సూపర్ స్టార్. ఇందుకోస భారీగా జుట్టు, గడ్డం, బాడీ పెంచేశాడు. అలాగే భారీ వర్కౌట్స్ చేస్తూ బాడీ మెయింటేన్ చేస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. దీంతో మహేష్- జక్కన్న మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ రానున్నాయి.
కత్తుల వారి పేటలో వెలసిన ఫ్లెక్సీ..
నువ్వు కాపాడిన 3772 వ ప్రాణం స్వామి 🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡 దైవం మానుష రూపేణ @urstrulyMahesh ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/Xp6Go329rN
— RISHI (@ursrishi7) October 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. చేయండి.