Kanguva: ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్న కంగువ ఫస్ట్ రివ్యూ.. 13 డిఫరెంట్ లుక్స్‌లో అదరగొట్టిన సూర్య
సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. ఇది అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు. దర్శకుడు మణిరత్నం శరవణన్ పేరును సూర్యగా మార్చారు. శరవణన్ పేరుతో ఇండస్ట్రీలో అప్పటికే ఒక నటుడు కాబట్టి కన్ఫ్యూజన్ రాకుండా ఉండేందుకు ఈ పేరు పెట్టాడు.
స్టార్ హీరో సూర్య నటించిన కంగువ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ఫస్ట్ రివ్యూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. హీరో సూర్య సినిమాలకు ఉండే క్రేజ్ అందరికి తెలిసిందే.. ప్రస్తుతం సూర్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు కంగువ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయ్యాడు. సూర్యకు తెలుగులోనూ మంచి క్రేజ్ తో పాటు మంచి మార్కెట్ కూడా ఉంది. ఆయన సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దాంతో సూర్య నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. ఈక్రమంలో ఇప్పుడు కంగువ సినిమా పై తెలుగు ఆడియన్స్ లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కంగువ సినిమా ఫస్ట్ రివ్యూ ఇప్పుడు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి : Uday Kiran: అంత పెద్ద హీరో.. ఆయన డెడ్ బాడీ మార్చురీలో ఓ మూలన పడేశారు: ఆర్పీ పట్నాయక్ ఎమోషనల్
ఇక కంగువ సినిమా పై అభిమానులలో భారీ అంచనాలను క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ భారీ హైప్ ను క్రియేట్ చేశాయి . ఈ చిత్రానికి సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు. రాజు కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఇది కూడా చదవండి : Tollywood: శ్రీదేవితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోగారి భార్య కూడా ఆమె
దిశా పఠానీ, బాబీ డియోల్, కోవై సరళ, యోగి బాబు, రెడ్టిన్ కింగ్స్లీ, నటరాజన్ సుబ్రమణియన్, జగపతి బాబు, కెఎస్ రవికుమార్ తదితరులు ఈ చిత్రంలో కలిసి నటించారు. కంగువ, దాదాపు 2 సంవత్సరాలకు పైగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా గంగువ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి. 10కి పైగా భాషల్లో 3డి టెక్నాలజీలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సూర్య 13 డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 14న సినిమాను విడుదల చేయనున్నట్టు కంగువ మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ విడుదలై ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే గేయ రచయిత మదన్ కర్కీ కంగువ సినిమా గురించి తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. అందులో కంగువ పూర్తి వెర్షన్ చూశాను. డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఒక్కో సీన్‌ని వందసార్లకు పైగా చూశాను కానీ ఒక్కోసారి చూసే కొద్దీ సినిమా ప్రభావం మరింత పెరిగింది. అలాగే ఈ సినిమాలో సూర్య నటన అద్భుతంగా ఉందని పోస్ట్‌లో పేర్కొన్నారు.
Watched the full version of #Kanguva today. I’ve seen each scene more than a hundred times during the dubbing process, yet the impact of the movie grows with every viewing.
The grandeur of the visuals, the intricate detailing of the art, the depth of the story, and the majesty…
— Madhan Karky (@madhankarky) October 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.