AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రూ.7.50 కోట్లతో లగ్జరీ కారు కొన్న రామ్ చరణ్.. అందులో ప్రత్యేకత ఏంటంటే..

మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.

Ram Charan: రూ.7.50 కోట్లతో లగ్జరీ కారు కొన్న రామ్ చరణ్.. అందులో ప్రత్యేకత ఏంటంటే..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Oct 24, 2024 | 2:28 PM

Share

పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోలలో రామ్ చరణ్ ఒకరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ మెగా హీరో.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న చరణ్.. తనదైన నటనతో విమర్శకులను సైతం మెప్పించాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ తెలుగులో టాప్ నటుల్లో ఒకరిగా ఎదిగారు. సినిమాల్లో నటించడమే కాకుండా, రామ్ చరణ్ మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ రూ.7.50 కోట్ల విలువైన లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. టాలీవుడ్‌లో ఇంత భారీ లగ్జరీ కారు మరెవరికీ లేదు. ఇంతకీ ఈ కారు ఫీచర్లు ఏమిటి? అనేది తెలుసుకుందాం.

రామ్ చరణ్ కొనుగోలు చేసిన కారు రోల్స్ రాయిస్. ఇప్పటికే చాలా మంది నటుల సొంతం చేసుకున్న కారు ఇది. ఇది చాలా ఖరీదైనది.. అలాగే వినూత్నమైన సాంకేతికతలు.. భద్రతా ఫీచర్స్ కలిగి ఉన్నది. రామ్ చరణ్ రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారును కొనుగోలు చేసాడు, ఈ కారు ధర 7.50 కోట్ల రూపాయలు. రోల్స్ రాయిస్ ఇతర కార్ల కంటే స్పెక్టర్ కారు డిజైన్, టెక్నాలజీలో చాలా మార్పులు కలిగి ఉంటుంది. ఈ కారులో రెండు డోర్లు, నలుగురు కూర్చునే సామర్థ్యం ఉంది. ఈ కారు లోపలి భాగాన్ని అత్యుత్తమ నాణ్యత కలిగిన కార్బన్ ఫైబర్, నాణ్యమైన లెదర్ ఉపయోగించి రూపొందించారు. ఇది ప్రయాణీకులకు పూర్తి భద్రతను అందిస్తుంది. అందుకే ఈ కారు ధర చాలా ఎక్కువ.

ఇప్పటికే చరణ్ గ్యారేజీలో అనేక కార్లు ఉన్నాయి. అలాగే సొంతంగా ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నాడు. అంతేకాదు.. ప్రైవేట్ జెట్ బిజినెస్ కూడా రన్ చేస్తున్నాడు. ఈ పరిశ్రమలో రామ్ చరణ్ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. రామ్ చరణ్ సినిమా నిర్మాణంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టారు.

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.