Tollywood: అనుకోకుండా గర్భం.. ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్నా.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంది. మొదట ఓ స్టార్ డైరెక్టర్ తో పెళ్లిపీటలెక్కిన ఈ అందాల తార కొన్నేళ్లకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఓ వ్యాపార వేత్తను రెండో వివాహం చేసుకుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్లలో అమలాపాల్ ఒకరు. లవ్ ఫెయిల్యూర్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన ఈ ముద్దుగుమమ్మ ఆ తర్వాత బెజవాడ, నాయక్, ఇద్దరమ్మాయిలతో తదితర సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తమిళం, మలయాళం సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులకు బాగా చేరువైంది. కొన్ని వెబ్ సిరీసుల్లోనూ నటించి మెప్పించిన అమలా పాల్ వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్ర ఆటు పోట్లు ఎదుర్కొంది. మొదట తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుందీ ముద్దుగుమ్మ. అయితే కొన్నేళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 2014లో పెళ్లి చేసుకున్న వీరు 2017లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత చాలా ఏళ్ల వరకు సింగిల్ గానే లైఫ్ లీడ్ చేసింది అమలా పాల్. సినిమాలతో బిజీ బిజీగా గడిపింది. అయితే 2023లో సడెన్ గా రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది అమలాపాల్. ప్రముఖ బిజినెస్ మ్యాన్ జగత్ దేశాయ్ ని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే అప్పట్లో ఈ పెళ్లిపై చాలా రూమర్లు వచ్చాయి. అమలాపాల్ గర్భం దాల్చిందని అందుకే సడెన్ గా పెళ్లి చేసుకుందని ప్రచారం జరిగింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమలా పాల్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే జగత దేశాయ్ తో ప్రేమ పెళ్లి, సంతానంపై ఓపెన్ కామెంట్స్ చేసింది. ‘జగత్ దేశాయ్‌తో నా బంధం గురించి ఓపెన్. అందులో దాచిపెట్టాల్సిందేమీ లేదు. మా మనసులు మాత్రమే కాదు శారీరాలు కలిశాయి. దాంతో నాకు అనుకోకుండా గర్బ వచ్చింది. ప్రెగ్నెన్సీ కారణంగా మా పెళ్లి అనుకోకుండా జరిగింది. సమాజం కోసం బలవంతంగా నేను రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.
భర్త, కుమారుడితో అమలాపాల్..
View this post on Instagram
ప్రస్తుతం అమలా పాల్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. కాగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉందీ హీరోయిన్. తన టైమ్ ను పూర్తిగా ఫ్యామిలీకే కేటాయిస్తోంది. కొడుకు ఇలాయ్‌తో ఆడుతూ పాడుతూ ఉండే వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




