MAA Elections 2021: రోజుకో ట్విస్ట్.. ఉత్కంఠగా మారిన ‘మా’ ఎన్నికలు.. వేడెక్కిన రాజకీయం

సినిమాల్లో డైలాగ్‌లు, పంచులు పేలినట్టు.. ఇప్పుడు 'మా' ఎన్నికల్లో విత్‌డ్రాలు పేలిపోతున్నాయి. రోజుకో బాంబ్‌ను బయటకు తీస్తున్నారు. రీల్‌లో ట్విస్ట్‌లతో స్టోరీని రక్తికట్టించినట్టు...

MAA Elections 2021: రోజుకో ట్విస్ట్.. ఉత్కంఠగా మారిన 'మా' ఎన్నికలు.. వేడెక్కిన రాజకీయం
Maa Elections 2021
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 02, 2021 | 4:09 PM

సినిమాల్లో డైలాగ్‌లు, పంచులు పేలినట్టు.. ఇప్పుడు ‘మా’ ఎన్నికల్లో విత్‌డ్రాలు పేలిపోతున్నాయి. రోజుకో బాంబ్‌ను బయటకు తీస్తున్నారు. రీల్‌లో ట్విస్ట్‌లతో స్టోరీని రక్తికట్టించినట్టు కీలక నేతలు ఎన్నికల రణరంగం నుంచి బయటకు వస్తున్నారు. ‘మా’ జనరల్‌ సెక్రటరీగా పోటీ చేస్తున్న బండ్ల గణేష్‌ శుక్రవాం విత్‌డ్రా చేసుకున్నాడు. తాజాగా సీవీఎల్‌ నరసింహారావు అధ్యక్ష బరి నుంచి తప్పుకున్నారు. ఇలా రోజుకో ఒకరు నామినేషనస్లను ఉపసంహరించుకుంటూ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నారు. రీల్‌ పాలిటిక్స్‌.. రియల్‌ పాలిటిక్స్‌ను మించి పోతున్నాయి. ఎత్తుకు పై ఎత్తు అన్నట్టుగా సాగుతున్న ఈ ఎన్నికల సమయంలో ఎవరు చివరి వరకు పోటీలో ఉంటారో ఎవరు మధ్యలో తూచ్ అంటారో సస్పెన్స్‌గా మారింది. మొదటి నుంచి ఈ ఎపిసోడ్‌లోనే హాట్‌ హాట్‌గా మారిన బండ్ల గణేష్‌ తన నామినేషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కాని.. తాను ఎన్నికల బరినుంచి తప్పుకుంటున్నట్టు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అందులో.. నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచన మేరకు తాను.. ‘మా’ జనరల్‌ సెక్రటరీ నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నానని ట్వీట్‌ చేశారు.

అయితే… ఆ దైవ సమానులు ఎవరు ? ఎవరూ ఆ ఆత్మీయులు? ఎవరూ ఆ శ్రేయోభిలాషులు? ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. అయితే.. తన ట్విట్టర్‌లో ఓ ఫోటో మాత్రం పోస్టు చేశారు. ఆ ఫోటోలో హీరో శ్రీకాంత్‌, ‘మా’ అధ్యక్షునిగా నామినేషన్‌ వేసిన ప్రకాష్‌ రాజ్‌, మరో వ్యక్తి కూడా ఉన్నారు. అంతేకాదు టీవీ9 వేదికగా తన మద్దతు ప్రకాశ్ రాజ్‌కే అని చెప్పేశారు. ఈ చర్చ ఇలా సాగిపోతుండగానే.. మరో కీలక సభ్యుడు CVL నరసింహారావు ఈ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ‘మా’ అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇవాళ ఉదయమే ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించిన ఆయన.. అకస్మాత్తుగా పోటీ నుంచి బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ ఉపసంహరణకు కారణాలు మాత్రం రెండు రోజుల్లో చెబుతానని తెలిపారు. అలా అంటూనే.. తన నామినేషన్‌ విత్‌డ్రాకు కారణం ఉందన్న ఆయన.. పదవి కంటే సభ్యుల సంక్షేమమే ముఖ్యమన్నారు. ఇప్పుడు పోటీల్లో ఉన్న రెండు ప్యానెల్స్‌లో ఎవరికీ మద్దతు ఇవ్వటం లేదన్నారు.

ఇలా రోజుకో ట్విస్ట్‌తో ‘మా’ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా రక్తి కట్టిస్తున్నాయి. ఒకప్పుడు సాదాసీదాగా జరిగే ఎలక్షన్లు ఇప్పుడు సాధారణ ఎన్నికల్ని తలపిస్తున్నాయి. గట్టిగా కొడితే వెయ్యి మంది సభ్యులు కూడా ఉండరు.. అలాంటిది ప్యానళ్లుగా విడిపోయి సమరానికి సై అంటూ తలపడుతున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘మా’ ప్రెసిడెంట్ రేసులో ఉన్న ప్రకాష్‌ రాజ్‌ టార్గెట్‌గా అపోజిషన్‌ విమర్శలు చేస్తోంది. ఆరంభంలోనే నాన్‌ లోకల్ అంటూ అభ్యంతరాలు వ్యక్తమైతే.. లెటెస్ట్‌గా నాన్ తెలుగు, గెస్ట్‌ అనే పదాలను తీసుకొచ్చి విమర్శిస్తున్నారు. ఈ పదాలు ఎందుకు వాడుతున్నారో అర్థం కావడం లేదని ప్రకాష్‌ రాజ్ వాపోతున్నారు.

ఇలాంటి సమయంలోనే నామినేషన్లు వేసిన కీలక నేతలు నామినేషన్లు ఉపసంరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఫైనల్‌గా రెండు ప్యానల్స్‌ బరిలో నిలుచున్నాయి. ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్‌, హీరో విష్ణు ప్యానల్‌ తలపడుతున్నాయి. ఇక ముందు ముందు కూడా ఎలాంటి టర్నింగ్స్‌, బర్నింగ్స్‌ జరుగుతాయో కూడా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఎవరు ఎవరిని బుజ్జగిస్తున్నారో? ఎవరు ఎవరితో చర్చిస్తున్నారో? ఎక్కడ ఏ గుస గుసలు జరుగుతున్నాయో తెలియడం లేదు. ఇప్పుడున్న రెండు ప్యానల్స్‌లో కూడా ఎవరు చివరి అంకం వరకు నిలబడుతారో? ఎవరు తలపడుతారో? అన్న చర్చ కూడా సాగుతోంది.

Also Read: తవ్వుతున్న కొద్దీ కదులుతున్న డొంక.. మాట్రిమోనీ మోసగాడి వలలో ఎందరో యువతులు..

డెత్ సర్టిఫికెట్‌లో “కోవిడ్ సస్పెక్ట్”.. సాయం అందక చిన్నబోతున్న బాధిత కుటుంబాలు