Akkineni : అక్కినేని ఫ్యామిలిలో స్క్రీన్‌ మీదకు వచ్చిన నటీ- నటుల పెళ్లిళ్లు డిజాస్టర్లే.. వివరాలు ఇక్కడ

చైతూ -సామ్‌ జంట విడిపోతుందని ఎప్పటినుంచో సంకేతాలు అందుతూనే ఉన్నాయి. డీప్‌ లవ్‌లో ఉన్న సమయంలో ఇద్దరు తమ చేతుల మీద పచ్చబొట్టు వేసుకున్నారు.

Akkineni : అక్కినేని ఫ్యామిలిలో స్క్రీన్‌ మీదకు వచ్చిన నటీ- నటుల పెళ్లిళ్లు డిజాస్టర్లే.. వివరాలు ఇక్కడ
Akkineni
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 02, 2021 | 4:52 PM

చైతూ -సామ్‌ జంట విడిపోతుందని ఎప్పటినుంచో సంకేతాలు అందుతూనే ఉన్నాయి. డీప్‌ లవ్‌లో ఉన్న సమయంలో ఇద్దరు తమ చేతుల మీద పచ్చబొట్టు వేసుకున్నారు. నాగచైతన్య చేతి మీద సమంత పేరుతో టాటూ ఉంటే.. సమంత చేతి మీద నాగచైతన్య పేరుతో టాటూ ఉంది. కాని విడాకులకు ముందే తన చేతిపై ఉన్న టాటూను చెరిపేశాడు నాగచైతన్య. అప్పుడే ఇద్దరి మధ్య అనుబంధం తగ్గిందని ప్రపంచానికి తెలిసిపోయింది. సమంత కూడా తన పేరులో అక్కినేని పదాన్ని తొలగించడంతో మరింత క్లారిటీ వచ్చింది. దీంతో ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. మీడియాలో రకరకాల ఊహాగానాలు తెరపైకి రావడంతో అటు సమంత , ఇటు చైతూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక దశలో సమంత బాంబేకు షిఫ్ట్‌ అయినట్టు ప్రచారం జరిగింది. కాని తనకు హైదరాబాద్‌ అంటే ఇష్టమని కొద్దిరోజుల క్రితం ట్విస్ట్‌ ఇచ్చారు సామ్‌. ఫ్రెండ్స్‌తో కలిసి సైక్లింగ్‌ చేసిన వీడియోను ఆమె షేర్‌ చేశారు. అప్పటికి కూడా సమంత విడాకులపై క్లారిటీ ఇవ్వలేదు. చివరకు ట్విటర్‌లో ఇద్దరు విడాకులపై క్లారిటీ ఇవ్వడంతో సస్పెన్స్‌కు తెరపడింది.

ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలిలో స్క్రీన్‌ మీదకు వచ్చిన నటుల పెళ్లిళ్లు డిజాస్టర్లే అయ్యాయి. ముందుగా అక్కినేని మొదటి భార్యకు విడాకులు ఇచ్చి అమలను వివాహమాడారు.. నాగ్ మొదటి భార్య దగ్గుబాటి వెంకటేష్ సోదరి అన్న విషయం తెలిసిందే.. ఆతర్వాత మరో అక్కినేని హీరో సుమంత్‌ కూడా కీర్తిరెడ్డి నుంచి విడాకులు తీసుకున్నారు. అలాగే అక్కినేని సుప్రియ కూడా ఇష్టం  సినిమా హీరోతో పెళ్లి పెటాకులు చేసుకుంది. ఇక అఖిల్‌ ఎంగేజ్‌మెంట్‌ అయిన తర్వాత పెళ్లికి ముందే డీల్‌ క్యాన్సిల్‌ అయ్యిన విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య- సమంత జంట కూడా విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇలా అక్కినేని ఫ్యామిలీలో స్క్రీన్ మీదకు వచ్చిన నటుల పెళ్లిళ్లు డిజాస్టర్లు అయ్యాయి.  

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?