Cheating: తవ్వుతున్న కొద్దీ కదులుతున్న డొంక.. మాట్రిమోనీ మోసగాడి వలలో ఎందరో యువతులు..

ఫోన్‌‌లో పరిచయం చేసుకుంటాడు.. ఆ తర్వాత మాటా మాట కలిపేస్తాడు. అంతే..ప్రేమంటూ ట్రాప్‌లోకి లాగేస్తాడు. ఆమె ఒంటరిగా ఉందని తెలిస్తే..

Cheating: తవ్వుతున్న కొద్దీ కదులుతున్న డొంక.. మాట్రిమోనీ మోసగాడి వలలో ఎందరో యువతులు..
Cheater Kiran
Follow us

|

Updated on: Oct 02, 2021 | 3:25 PM

ఫోన్‌‌లో పరిచయం చేసుకుంటాడు.. ఆ తర్వాత మాటా మాట కలిపేస్తాడు. అంతే..ప్రేమంటూ ట్రాప్‌లోకి లాగేస్తాడు. ఆమె ఒంటరిగా ఉందని తెలిస్తే.. చెట్టాపట్టాలేసుకొని తిరుగేస్తాడు. నమ్మారంటే నట్టేట ముంచేస్తాడు. అలా ఒకరిని కాదు ఇద్దరిని కాదు.. ఎంతో మంది జీవితాలతో ఆటలాడుకుంటున్న కేటుగాడ్ని సైబరాబాద్‌ పోలీసులు కటకటాల్లోకి నెట్టేశారు.

ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ బండారం బయట పడింది. కరీంనగర్‌, వరంగల్‌ వయా హైదరాబాద్‌ టు తిరుపతిగా సాగిన యవ్వారాన్ని సైబరాబాద్‌ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మాట్రిమోనీ మోసగాన్ని అరెస్ట్‌ చేశారు. ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా తన వ్యహారాన్ని నడిపించేస్తాడు. మ్యాట్రిమోనీలో ఉండే లేడీస్‌ ప్రొఫైల్స్‌ను చూసి కాంటాక్ట్‌ చేయడమే పనిగా పెట్టుకుంటాడు. తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటూ యువతులను బోల్తా కొట్టిస్తాడు. కరీనంగర్‌లో ఓ అమ్మాయిని ప్రేమించిన కిరణ్‌ కొన్ని రోజులు చెట్టాపట్టాలేసుకొని తిరిగేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మొఖం చాటేశాడు. ఇలాగే.. వరంగల్‌లోనూ మరో మహిళను చీట్‌ చేసి లక్షల్లో డబ్బులు గుంజేశాడు. ఈ తరహా మోసాలు పెరిగిపోవడంతో బాధితురాళ్ల కంటికి కనపడకుండా తిరిగేస్తున్నాడు. ధైర్యం చేసిన ఓ యువతి సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేసిన పోలీసులు కరీంనగర్‌, వరంగల్‌లో మోసం చేసి.. ఇతర జిల్లాలో తప్పించుకొని తిరుగుతున్నాడని గుర్తించారు. మాయగాడిపై ప్రత్యేక నిఘా వేసి తిరుపతిలో ఉన్నట్టు జాడ తెలుసుకున్నారు. అంతే పక్కాగా ప్లాన్ చేసి మాయగాడిని పట్టేశారు. విచారణ కోసం హైదరాబాద్‌ తీసుకొచ్చిన నాలుగు పోలీస్‌ టీమ్స్‌.. లోతైన దర్యాప్తు చేస్తున్నాయి. ఇతగాడు ఎక్కడెక్కడ మోసాలు చేశాడు? ఎంత మంది ఇతగాడి మాయ మాటలకు మోస పోయారు? పెళ్లిళ్లతోనే మోసం చేశాడా? ఇంకేమైనా చీటింగ్‌కు పాల్పడ్డాడా? అన్న కోణంలో విచారణ జరుగుతోంది.

Also Read:  డెత్ సర్టిఫికెట్‌లో “కోవిడ్ సస్పెక్ట్”.. సాయం అందక చిన్నబోతున్న బాధిత కుటుంబాలు

రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
'గీతాంజలి అలాంటి అమ్మాయి'.. రష్మిక రియాక్షన్..
'గీతాంజలి అలాంటి అమ్మాయి'.. రష్మిక రియాక్షన్..