AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: డెత్ సర్టిఫికెట్‌లో “కోవిడ్ సస్పెక్ట్”.. సాయం అందక చిన్నబోతున్న బాధిత కుటుంబాలు

కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్స్‌లో ఎంతోమంది చనిపోయారు. ఇంట్లో ఒకరో, ఇద్దరో కాదు..కుటుంబంలో మిగిలింది ఎంత మంది అని లెక్కబెట్టుకునే కన్నీటి గాథలు ఎన్నో.

Coronavirus:  డెత్ సర్టిఫికెట్‌లో కోవిడ్ సస్పెక్ట్.. సాయం అందక చిన్నబోతున్న బాధిత కుటుంబాలు
Covid Deaths
Ram Naramaneni
|

Updated on: Oct 02, 2021 | 3:03 PM

Share

కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్స్‌లో ఎంతోమంది చనిపోయారు. ఇంట్లో ఒకరో, ఇద్దరో కాదు..కుటుంబంలో మిగిలింది ఎంత మంది అని లెక్కబెట్టుకునే కన్నీటి గాథలు ఎన్నో. మాటల్లో చెప్పలేని విషాదాలు చాలా జరిగాయి. కరోనా లక్షణాలతో యాంటీజన్, ఆర్‌పీసీఆర్ పరీక్షలు చేసుకుని కరోనా నిర్ధారణ అయి.. చనిపోయిన వారు వందల్లో ఉంటే.. పరీక్షలు చేసుకుని ఇంట్లోనే ఉంటూ కరోనాతో మరణించిన వారు అనేకమంది ఉన్నారు. మరి వారందరిని ఇప్పుడు అధికారులు ఏ లెక్కల్లో చేర్చారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ కరోనాతో మరణించలేదు అంటే మరి వారు ఏ లెక్కల్లో ఉంటారు.. అనేది ఇప్పుడు ప్రధాన అంశం.  తండ్రిని కోల్పోయి ఒకరు, భర్తని కోల్పోయి మరొకరు, కొడుకుని కోల్పోయి మరొకరు. ఇలా ఎన్నో కన్నీటి వ్యధలు. కుటుంబంలో పెద్ద దిక్కుని కోల్పోయి అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆసుపత్రి నుంచి ఇవ్వాల్సిన మెడికల్ లెటర్ లో కాజ్ ఆఫ్ డెత్ కోవిడ్ అయినా కూడా.. కోవిడ్ సస్పెక్ట్ అని పెడుతూ వుండడంతో.. అనేకమంది ఇప్పుడు ఎవరిని అడగాలో తెలియక ప్రభుత్వానికి ఫిర్యాదుల రూపంలో తమ బాధను తెలియజేస్తున్నారు. కనీసం డెత్ సెర్టిఫికెట్ లో కరోనాతో చనిపోయారని రాస్తే.. ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం అయినా అందుతుందంటున్నారు బాధిత కుటుంబాలు.

ఇలా అనేకమంది కరోనాతో చనిపోయినప్పుడు కేంద్రం ఇచ్చే సహాయం పొందడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు, మెడికల్ డిపార్ట్‌మెంట్ సాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కోవిడ్ తో చనిపోయిన వారి రిపోర్ట్స్ చెక్ చేసి.. తిరిగి కొవిడ్ డెత్ సర్థిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల్లో కరోనా నిర్దారణ అయ్యాక కూడా కరోనా మరణం అని గుర్తించకపోతే మరి అవి ఎలాంటి మరణాలో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

Also Read: వివాదంలో వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమా.. హీరో పేరును తప్పుబడుతూ..

 అగ్రకుల మహిళలకు గుడ్ న్యూస్.. ఈబీసీ నేస్తం కోసం దరఖాస్తులకు ఆహ్వానం..

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు