EBC Nestham Scheme: అగ్రకుల మహిళలకు గుడ్ న్యూస్.. ఈబీసీ నేస్తం కోసం దరఖాస్తులకు ఆహ్వానం..

EBC Nestham Scheme: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఈబీసీ నేస్తం' పథకంలో లబ్ది పొందేందుకు అర్హులైన అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని..

EBC Nestham Scheme: అగ్రకుల మహిళలకు గుడ్ న్యూస్.. ఈబీసీ నేస్తం కోసం దరఖాస్తులకు ఆహ్వానం..
Ebc Nestham Scheme
Follow us
Surya Kala

|

Updated on: Oct 02, 2021 | 10:45 AM

EBC Nestham Scheme: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈబీసీ నేస్తం’ పథకంలో లబ్ది పొందేందుకు అర్హులైన అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనున్నది. అగ్రకులాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళలుఅర్హులు. ఈబీసీ నేస్తం పథకం పూర్తి సమాచారం మీకోసం..

ఈ పథకం జీవో విడుదల అయిన రోజుకు 45 నుంచి 60 సంవత్సరాలు నిండిన ఈబీసీ మహిళలకు వారి జీవన ప్రమాణాలు మెరుగు పరచటం కోసం ఆర్థిక సాయం అందించటం ముఖ్యఉద్దేశ్యం. లబ్ధిదారులకు ఆర్థిక సాయంగా ఏడాదికి 15000/- చెప్పున మూడు సంవత్సరాలుకు 45000/- రూపాయలు అందించనున్నారు. దీనికోసం 2021-22 బడ్జెట్ కింద ప్రభుత్వం సంవత్సరానికి 670-605 కోట్లు అలా మూడు సంవత్సరాలు కు 1810-2011 కోట్లు కేటాయించింది.

ఈ పథకానికి అర్హతలు:

వైయస్సార్ చేయూత, కాపు నేస్తం లో ఉన్న లబ్దిదారుతో పాటు ఎస్సీ , ఎస్టీ , బిసి మైనారిటీ మహిళలు అర్హులు కారు. కేవలం ఈబిసి మహిళలు మాత్రమే అర్హులు. అంతేకాదు లబ్ధిదారుల పేరుతో ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్కు ఉండాలి. ఇక వార్షిక కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు రూ. 10వేలు, పట్టణాలలో అయితే నెలకు రూ.12వేలు పరిమితిని మించకూడదు. ఆ పథకంలో లబ్ధిదారులకు పల్లపు భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా పల్లపు భూమి మరియు మెట్ట భూమి రెండు కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి.కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి గాని పెన్షనర్ గాని ఉండకూడదు. అయితే ఈ నిబంధనలో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చారు. కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఫోర్ వీలర్ ఉండకూడదు. కుటుంబంలో ఎవరూ కూడా ఇన్కమ్ టాక్స్ కడుతున్న వారు ఉండకూడదు. సెప్టెంబర్ 29వ తేదీ 2021 నాటికి 45 సం.లు కంటే ఎక్కువ.. 60 సం.లు లోపు ఉన్న అగ్రకుల మహిళలు ఈనెల 7వ తేదీలోపు సమీప గ్రామ వార్డు, సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

Also Read:  సీఎం జగన్ కి కోవిడ్ రూల్స్ వర్తించవా అంటూ ప్రశ్నిస్తున్న జనసేన నేత నాదెండ్ల మనోహర్..