Janasena: సీఎం జగన్ కార్యక్రమానికి లేని రూల్స్.. పవన్ పర్యటనకే ఎందుకు..? నాదెండ్ల మనోహర్

Janasena-Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల, జనసేన నేతల మధ్య రోజు రోజుకీ మాటల యుద్ధం పెరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి..

Janasena: సీఎం జగన్ కార్యక్రమానికి లేని రూల్స్.. పవన్ పర్యటనకే ఎందుకు..? నాదెండ్ల మనోహర్
Nadendla Manohar
Follow us
Surya Kala

|

Updated on: Oct 02, 2021 | 9:37 AM

Janasena-Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల, జనసేన నేతల మధ్య రోజు రోజుకీ మాటల యుద్ధం పెరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి ఇరు పార్టీల మధ్య రాజకీయ వైరం మరింత ముదురుతోంది. ఏపీ ప్రభుత్వం పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ విమర్శలకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అదే రేంజ్ లో కౌంటర్ అటాక్ చేస్తున్నారు. దీంతో రాజకీయం హీట్ ఎక్కింది. ఈ నేపథ్యంలో ఇక గత కొంతకాలంగా ఏపీ రోడ్ల దుస్థితిపై జనసేన పోరాటం చేస్తోంది. ఇటీవల రోడ్లను బాగుచేయాలంటూ సోషల్ మీడియా ఉద్యమాన్ని కూడా చేపట్టింది. తాజాగా గాంధీ జయంతి సందర్భంగా శాంతియుతంగా శ్రమదాన కార్యక్రమం ద్వారా రహదారులకు మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ సంకల్పించారు.

అయితే పవన్ చేపట్టిన శ్రమదాన కార్యక్రమానికి ప్రభుత్వం పోలీసుల ద్వారా ఆటంకాలు సృష్టిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అంతేకాదు ప్రభుత్వం చేస్తుంది అప్రజాస్వామిక చర్య. ఇది ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమని అన్నారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల రోడ్లు దెబ్బ తింటే జనసేన మరమ్మతులు చేస్తోంది. శ్రమదానం చేస్తామని ఎవరూ చెప్పలేదు.. అనుమతులు లేవు అని పోలీసు అధికారులతో పాలకపక్షం అబద్దాలు చెప్పిస్తోందని అన్నారు.

అంతేకాదు తాము చేపట్టిన కార్యక్రమం గురించి సెప్టెంబర్ 27వ తేదీన రాష్ట్ర డీజీపీకి ఈ కార్యక్రమం గురించి తెలియచేశామని అన్నారు. అదే విధంగా రాజమండ్రి అర్బన్ ఎస్పీ, అనంతపురం ఎస్పీకి కూడా తెలియచేశామని చెప్పారు. అయితే ఇప్పుడు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనవద్దు అంటూ జనసేన నాయకులను, కార్య కర్తలను గృహనిర్బంధాలు చేస్తూ అడ్డుకొంటున్నారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. అంతేకాదు కొద్దిసేపట్లోనే పవన్ కల్యాణ్ రాజమండ్రికి బయలుదేరనున్నారని తెలిపారు.

సీఎంకి రూల్స్ వర్తించవా?

అంతే కాదు ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, జనం గుమికూడ రాదు అంటూ పవన్ కళ్యాణ్ పర్యటన పై రూల్స్ చెబుతున్నారు. మరి ఈ రూల్స్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి వర్తించవా.. అని ప్రశ్నించారు. ఈ రోజు విజయవాడ బెంజి సర్కిల్ లో సీఎం జగన్ నిర్వహించే కార్యక్రమానికి ఎందుకు వర్తింపచేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. విజయవాడను దిగ్బంధించి మరీ వేలమందితో చెత్త వాహనాల కార్యక్రమం చేస్తే కోవిడ్ రాదా? అప్పుడు జనం గుమిగూడరా? అన్నారు నాదెండ్ల మనోహర్

Also Read:   శ్రీ కృష్ణదేవరాయ మరణించిన తేదీపై స్పష్టత.. వర్ధంతిని అధికారికంగా జరపాలని సూచన