Sri Krishnadevaraya: శ్రీ కృష్ణదేవరాయ మరణించిన తేదీపై స్పష్టత.. వర్ధంతిని అధికారికంగా జరపాలని సూచన

Sri Krishnadevaraya Death Date Confirmed: రాయలు ఏలిన సీమ రాయలసీమ రతనాల సీమ గా ప్రసిద్ధి.. తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణదేవరాయలు పేరు వినని వారు బహుశా ఉండరెమో...

Sri Krishnadevaraya: శ్రీ కృష్ణదేవరాయ మరణించిన తేదీపై స్పష్టత.. వర్ధంతిని అధికారికంగా జరపాలని సూచన
Krishnadevaraya
Follow us

|

Updated on: Oct 02, 2021 | 8:59 AM

Sri Krishnadevaraya Death Date Confirmed: రాయలు ఏలిన సీమ రాయలసీమ రతనాల సీమ గా ప్రసిద్ధి.. తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణదేవరాయలు పేరు వినని వారు బహుశా ఉండరెమో.. అహో ఆంధ్ర భోజ… శ్రీ కృష్ణదేవరాయ.. అనే పాట కూడా అందరి నోళ్లలో మెదులుతూనే ఉంటుంది. కర్ణాటకలోని హంపీ, అనంతపురం జిల్లా పెనుగొండ కోట ను రాజధానిగా చేసుకొని విజయనగర సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా పరిపాలించిన శ్రీ కృష్ణ దేవరాయలు మృతిపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లా హాన్నేదహల్లి లో లభించిన శాసనంలో పక్కాగా రాసి ఉంది. ఈ శాసనం ఇటీవలె పురావస్తు శాఖ, మైసూరు ఎపిగ్రఫి విభాగం అధికారులకు లభించింది. ఈ శాసనం లో ఉన్న అక్షరాలను క్షుణ్నంగా పరిశీలించి అధ్యయనం చేసి ఉన్నది ఉన్నట్లుగా తెలుగులో కన్నడలో వ్రాశారు.

శ్రీ కృష్ణ దేవరాయలు 1529 అక్టోబర్ 17న కాలధర్మం చెందినట్లుగా స్పష్టంగా శాసనంలో ఉంది అని పురావస్తు, కర్ణాటక ఏపిగ్రఫి అధికారులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. అక్టోబర్ 17న శ్రీకృష్ణదేవరాయల వర్ధంతిని అధికారికంగా జరపాలని కూడా ప్రభుత్వాలకు తమ లేఖలో సూచించారు. అదే తేదీన వర్ధంతిని జరిపేందుకు రాష్ట్రాలు సమాయత్తమవుతున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శ్రీకృష్ణదేవరాయల కుమార్తె తిరుమల భాయి(మోహనాంగి) రాసిన మరీచి పరిణయం గ్రంథంలో తన తండ్రి కృష్ణదేవరాయలు 1471 జనవరి 17న జన్మించినట్లు ఉంది. స్వయంగా కృష్ణదేవరాయల కుమార్తె రాశారు కనుక దానిపై ఎలాంటి వివాదమూ లేదు. కానీ నీ రాయలు మరణానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు లభించిన ఆధారాలతో చరిత్ర పరిశోధకులు సంతృప్తిగా లేరు. పూర్తి అసంతృప్తిగా ఉన్నట్లు బాహాటంగానే వెల్లడించారు కూడా. ఇలాంటి సందర్భంలో హోన్నేదహల్లి లో లభించిన శాసనం తో ఆయన మరణం పై పూర్తి స్పష్టత వచ్చిందని పురావస్తు శాఖ అధికారులు అంటున్నారు.

శ్రీకృష్ణదేవరాయలకు ప్రధాన అంగరక్షకుడు తిమ్మప్పన నాయకుడు స్వయంగా వేయించిన ఈ శాసనం లో 1529 అక్టోబరు 17న రాయలు కాలధర్మం చెందినట్లు స్పష్టంగా ఉంది. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయల కు సంబంధించి ఇప్పటివరకు లభించిన అనేక ఇతర శాసనాలతో ఇవి సరిపోతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలు కర్ణాటక లో రాయల వర్ధంతిని అక్టోబర్ 17న అధికారికంగా జరపాలని పురావస్తు శాఖ, మైసూరు ఎపీ గ్రఫీ డైరెక్టర్ ఆచార్య మునిరత్నం రెడ్డి ఇప్పటికే ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు..

Reporter : Nagi Reddy Tv9 Telugu

Also Read: Roja Daughter Anshu: ఎమ్మెల్యే రోజా తనయ అన్షుకు అరుదైన గౌరవం.. యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపిక..

Pawan Kalayan: పవన్ కళ్యాణ్ రాజమండ్రి టూర్ టెన్షన్.. ఓ వైపు జనసైనికులు ఏర్పాట్లు.. మరోవైపు అనుమతికి నో..