AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roja Daughter Anshu: రోజా తనయ అన్షుకు అరుదైన గౌరవం.. యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపిక

Nagari MlA Roja Daughter Anshu: ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే నగరి ఎమ్మెల్యే రోజా ముద్దుల తనయ అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత..

Roja Daughter Anshu: రోజా తనయ అన్షుకు అరుదైన గౌరవం.. యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపిక
Roja Daughter Anshu Image Credit source: https://influencermagazine.uk
Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 23, 2023 | 3:01 PM

Share

Roja Daughter Anshu: ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే నగరి ఎమ్మెల్యే రోజా ముద్దుల తనయ అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత ఇన్ఫ్లూఎన్సర్- UK మ్యాగజైన్ కవర్ పేజీపై అన్షు ఫొటోను ప్రచురించారు. అన్షు రచయితగా , ఎంట్రప్రెన్యుయర్ గా , ప్రోగ్రామర్‌గా సమాజం కోసం పాటుపడుతున్నందుకు యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపికైందని ఇన్ఫ్లూఎన్సర్ ప్రకటించింది. తాను అవార్డు ఎంపికైన విషయంపై అన్షు స్పందిస్తూ.. తన కల నెలవేరిందని సంతోష పడింది. కాగా ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై క్వీన్ ఆఫ్ టాలెంట్ గా అన్షు ఫోటో వేశారు.

మరోవైపు రోజా తనయ తల్లి లా అందడంగా ఉంటుంది. దీంతో ఆమె సినీ ఎంట్రీ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రోజా.. అదేవిధంగా రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ప్రజలకు సేవలందిస్తూ రాజకీయ నాయకురాలిగా కొనసాగుతున్నారు.. ఇటీవలే అన్షు మాలిక తన పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే.

Also Read:  Pawan Kalayan: పవన్ కళ్యాణ్ రాజమండ్రి టూర్ టెన్షన్.. ఓ వైపు జనసైనికులు ఏర్పాట్లు.. మరోవైపు అనుమతికి నో..