ECIL Recruitment: హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన ఈ సంస్థలో...

ECIL Recruitment: హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 02, 2021 | 8:40 AM

ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన ఈ సంస్థలో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 6వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీని ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా అభ్యర్థులకు టెక్నికల్‌ నాలెడ్జ్‌తో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 31-08-2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట బీఈ/బీటెక్‌లో వచ్చిన మార్కులు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 23,000 జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 06-10-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Amazon Great Indian: ప్రైమ్‌ మెంబర్స్‌కు ఆఫర్ల పండుగ ఒకరోజు ముందే ప్రారంభమైంది.. ఈ భారీ డిస్కౌంట్లను గమనించారా?

Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల గల్లంతు విధంబెట్టిదనిన.. కేటుగాళ్ల జాబితా చాంతాడంత.!

CM YS Jagan: నేడు ఏపీలో క్లాప్‌ పథకం ప్రారంభం, మ.12 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు. హైదరాబాద్‌, చెన్నై వెళ్లే వాహనాలు మళ్లింపు