Indian Navy Recruitment 2021: ఇంటర్మిడియేట్‌ పాస్‌తో ఉద్యోగ అవకాశాలు.. పూర్తి వివరాలు..!

Indian Navy Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో..

Indian Navy Recruitment 2021: ఇంటర్మిడియేట్‌ పాస్‌తో ఉద్యోగ అవకాశాలు.. పూర్తి వివరాలు..!
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Oct 02, 2021 | 6:28 AM

Indian Navy Recruitment 2021: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నాయి.ఇంటర్మీడియట్ పాస్ అయినవారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి . ఇండియన్ నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌ను ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. పెళ్లికాని యువకులు మాత్రమే ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయాలి. ఎంపికైనవారు కేరళలోని ఎజిమలలోని ఇండియన్ నేవి అకాడమీలో నాలుగేళ్ల బీటెక్ కోర్స్ చేయాల్సి ఉంటుంది. 2022 జనవరిలో బీటెక్ డిగ్రీ కోర్స్ ప్రారంభం అవుతుంది.

మొత్తం ఖాళీలు 35:

మొత్తం 35 ఖాళీలను ప్రకటించింది ఇండియన్ నేవీ. ఎడ్యుకేషన్, ఎగ్జిక్యూటీవ్, టెక్నికల్ బ్రాంచ్‌లో ఈ ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ 2021 అక్టోబర్ 1న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

►ఎడ్యుకేషన్ బ్రాంచ్ 5ఎగ్జిక్యూటీవ్, టెక్నికల్ బ్రాంచ్ 30

► గుర్తుంచుకోవాల్సిన అంశాలు:

► దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 1

► దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 10

► ఇంటర్వ్యూ- 2021 అక్టోబర్ లేదా నవంబర్

విద్యార్హతలు- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్‌తో 10+2 కనీసం 70 శాతం మార్కులతో పాస్ కావాలి. జేఈఈ మెయిన్ పరీక్ష రాసినవాళ్లు దరఖాస్తు చేయాలి. టెన్త్ లేదా ఇంటర్‌లో ఇంగ్లీష్‌లో 50 శాతం మార్కులు ఉండాలి.

వయస్సు- 2002 జూలై 2 నుంచి 2005 జనవరి 1 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేయాలి.

కోర్సులు- అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ లభిస్తుంది.

ఎంపిక విధానం- ఇంటర్వ్యూలు:

జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం- విశాఖపట్నం, బెంగళూరు, భోపాల్, కోల్‌కతా. అభ్యర్థులు వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత హోమ్ పేజీలో Current Events లో 10+2 B.Tech Cadet Entry Scheme లింక్ పైన క్లిక్ చేయాలి. ఇక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Apply Online పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అభ్యర్థి తన వివరాలతో అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు దరఖాస్తు చేయాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

ఇవీ కూడా చదవండి:

షాకింగ్‌.. దేశ వ్యాప్తంగా 94 పాఠశాలల మూసివేత..! కారణాలు ఇలా ఉన్నాయి..

AP ICET Results: ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల.. 90 శాతానికిపైగా ఉత్తీర్ణత. రిజల్ట్స్‌ ఇలా తెలుసుకోండి.