Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP ICET Results: ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల.. 90 శాతానికిపైగా ఉత్తీర్ణత. రిజల్ట్స్‌ ఇలా తెలుసుకోండి.

AP ICET Results: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఐసెట్‌, ఈసెట్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని..

AP ICET Results: ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల.. 90 శాతానికిపైగా ఉత్తీర్ణత. రిజల్ట్స్‌ ఇలా తెలుసుకోండి.
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 01, 2021 | 12:00 PM

AP ICET Results: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఐసెట్‌, ఈసెట్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్‌లో 34,789(91.27శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంజనీరింగ్‌ కోర్సులో ఎంట్రీవిధానంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఈసెట్‌ ఫలితాల్లో 29,904(92.53శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

ఇదిలా ఉంటే ఐసెట్‌ పరీక్షలను సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఈసెట్‌ పరీక్షలను హైదరాబాద్‌ సహా 48 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారంగా నిర్వహించారు. ఈ రెండు ప్రవేశ పరీక్షల్లోనూ 90 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధించడం విశేషం.

ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి..

* ముందుంగా అభ్యర్థులు sche.ap.gov.in లేదా manabadi.co.inలోకి వెళ్లాలి. * అనంతరం హోమ్‌ పేజీలో ఉండే ‘ఏపీ ఈసెట్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. * వెంటనే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ మీ అప్లికేషన్‌ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి సబ్‌మిట్ నొక్కాలి. * వెంటనే మీ ఫలితాలు కంప్యూటర్‌ స్క్రీన్‌పై వచ్చేస్తాయి. * ఇక ఐసెట్‌కు హాజరైన అభ్యర్థులు.. ఐసెట్‌ ఫలితాలను క్లిక్‌ చేసి సంబంధిత వివరాలు ఎంటర్‌ చేసి ఫలితాలు పొందొచ్చు.

Also Read:  Lord Ganesha: విఘ్నాలకధిపతి వినాయకుడి జీవితం నుంచి ఈ విషయాలను నేర్చుకుంటే.. జీవితం సుఖమయం

Tata-Air India: ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్.. 68 సంవత్సరాల తరువాత మళ్లీ..

Gas Cylinder Price: మండుతోన్న బండ.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. వారికి మాత్రం ఊరట!