AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder Price: మండుతోన్న బండ… మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. వారికి మాత్రం ఊరట!

అక్టోబర్ ఒకటో తేదీ వచ్చేసింది. ఓ షాకింగ్ న్యూస్ తెచ్చింది. అవును గ్యాండ బండ బరువు పెరిగింది. అలాగని గ్యాస్ వెయిట్ పెరిగింది అనుకునేరు.

Gas Cylinder Price: మండుతోన్న బండ... మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. వారికి మాత్రం ఊరట!
Lpg Price Today
Ram Naramaneni
|

Updated on: Oct 01, 2021 | 12:14 PM

Share

అక్టోబర్ ఒకటో తేదీ వచ్చేసింది. ఓ షాకింగ్ న్యూస్ తెచ్చింది. అవును గ్యాండ బండ బరువు పెరిగింది. అలాగని గ్యాస్ వెయిట్ పెరిగింది అనుకునేరు. గ్యాస్ బండ ధరలు పెరిగాయి. ప్రతీ నెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తూ ఉంటాయి. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి ఎల్‌పీజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ధరల పెంపు నిర్ణయం ఈరోజు నుంచే అమలులోకి రానుంది.  దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను సిలిండర్‌కు రూ. 43.50 పెంచింది. సవరించిన రేట్ల ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ .1693 నుంచి రూ .1736.50 కి పెరిగింది. అయితే ఇక్కడ ఊరట కలిగే అంశం ఒకటుంది. ఈసారి 19 కేజీల గ్యాస్ సిలిండర్  రేటు మాత్రమే పెరిగింది. సాధారణ ప్రజలు ఉపయోగించే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 884.50, కోల్‌కతాలో రూ .911, ముంబైలో రూ .884.50, చెన్నైలో రూ. 900.50 గా ఉంది.

19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ కొత్త ధర

ప్రభుత్వ చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను పెంచాయి. ఢిల్లీలో అత్యధికంగా సిలిండర్‌కి రూ. 43.50 పెరిగింది. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ ధర రూ .43.5 పెరిగి రూ .1736.5 కి చేరుకుంది. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 35 పెరిగి రూ .1805.5 కి చేరుకుంది. ముంబైలో ధర రూ. 35.5 పెరిగి రూ .1685… చెన్నైలో రూ. 36.5 పెరిగి రూ. 1867.5 కి చేరుకుంది

LPG ధరను ఎలా చెక్ చేయాలి

LPG సిలిండర్ ధరను చెక్ చేయడానికి, మీరు ప్రభుత్వ చమురు కంపెనీ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఇక్కడ కంపెనీలు ప్రతి నెలా కొత్త రేట్లు జారీ చేస్తాయి. మీరు https://iocl.com/Products/IndaneGas.aspx లింక్‌లో మీ నగరంలో గ్యాస్ సిలిండర్ల ధరను చెక్ చేయవచ్చు.

Also Read:  కలికాలం అంటే ఇదే కదా..! రైస్ కుక్కర్‌తో పెళ్లేంటి గురూ..!

ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ‘తలా’నా మజాకా.. ప్రశంసల జల్లు

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?