Viral News: కలికాలం అంటే ఇదే కదా..! రైస్ కుక్కర్‌తో పెళ్లేంటి గురూ..!

మనం ఓ సినిమాలో సరదా సన్నివేశంలో కమెడియన్‌కి గాడిదను ఇచ్చి పెళ్లి చేయడం చూశాం. ఇంకా జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పోగొట్టుకోడానికి చెట్లతో వివాహాలు చేయడం కూడా చూస్తుంటాం....

Viral News: కలికాలం అంటే ఇదే కదా..! రైస్ కుక్కర్‌తో పెళ్లేంటి గురూ..!
Man Marries Rice Cooker
Follow us

|

Updated on: Oct 01, 2021 | 10:50 AM

మనం ఓ సినిమాలో సరదా సన్నివేశంలో కమెడియన్‌కి గాడిదను ఇచ్చి పెళ్లి చేయడం చూశాం. ఇంకా జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పోగొట్టుకోడానికి చెట్లతో వివాహాలు చేయడం కూడా చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి వింత వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. నెటిజన్లు ట్వీట్లు, లైక్‌లతో హోరెత్తిస్తున్నారు. ఇండోనేషియాకు చెందిన ఆనం అనే ఓ వ్యక్తి రైస్ కుక్కర్‌ను పెండ్లి చేసుకున్నాడు. తాను ప్రేమించే రైస్ కుక్కర్‌ను పెండ్లి చేసుకుంటున్న ఇండోనేషియన్ వ్యక్తి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో తెల్లని వెడ్డింగ్ డ్రెస్‌లో వరుడు మెరిసిపోయాడు, అంతేకాదు వధువుగా రైస్ కుక్కర్‌ను వైట్ డ్రెస్‌తో అందంగా ముస్తాబు చేశాడు. పెళ్లి అనంతరం తన కుక్కర్‌ భార్యతో కలిసి కెమెరాకు ఫోజులు ఇచ్చాడు. తమ పెండ్లికి చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైన పత్రాలపై పెండ్లికొడుకు ఆనం సంతకాలు చేస్తూ ఓ ఫోటోలో సందడి చేశాడు. మరో ఫొటోలో రైస్ కుక్కర్‌ను కిస్ చేస్తూ రొమాంటిక్ పోజిచ్చాడు.

ఈ ఫొటోలకు “వైట్‌..క్వైట్‌..పర్ఫెక్ట్‌..వెరీ డ్రీమీ” అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. సెప్టెంబర్ 20న కుక్కర్‌తో తన పెండ్లిని ప్రకటిస్తూ ఆనం ఫేస్‌బుక్ పేజీలో ఈ ఫొటోలు పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలకు 44 వేలకు పైగా లైక్‌లు, లక్షా 35 వేల రీట్వీట్‌లు వచ్చాయి. అయితే ఈ బంధం ఎక్కువకాలం సాగలేదు.  తాజాగా తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. తన భార్య(కుక్కర్) అన్నం బాగా వండుతుంది కానీ ఇతర వంటకాలు చేయడంలో ప్రతిభ చూడటం లేదని ఆనం పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసినవారంతా.. ఇతగాడికి మతి భ్రమించిందా అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అతడు పబ్లిసిటీ కోసం ఇలా చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

Also Read: ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ‘తలా’నా మజాకా.. ప్రశంసల జల్లు

ఆన్‌లైన్ క్లాసుల కోసం ఫోన్ ఇస్తే.. అదే పనిగా చాటింగ్.. గద్దించిన పేరెంట్స్.. బాలిక షాకింగ్ నిర్ణయం

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..