AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బయటకు డెయిరీ ఫామ్.. లోపల మత్తు దందా.. పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు..

బయటకు చూస్తే పశువుల సంరక్షణ.. లోపల మాత్రం గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని ఓ డెయిరీ ఫామ్‌ను అడ్డాగా చేసుకుని యథేచ్ఛగా సాగుతున్న గంజాయి దందాకు పోలీసులు చెక్ పెట్టారు. డెయిరీ ఫామ్‌పై ఈగల్ ఫోర్స్, పటాన్‌చెరు పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి చేసి నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Telangana: బయటకు డెయిరీ ఫామ్.. లోపల మత్తు దందా.. పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు..
Ganja Racket Busted At Dairy Farm
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Nov 01, 2026 | 4:47 PM

Share

డెయిరీ ఫామ్‌ను అడ్డాగా చేసుకుని గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును ఈగల్ ఫోర్స్, పటాన్‌చెరు పోలీసులు రట్టు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం కర్దనూర్ గ్రామంలోని గోవిందరావు డెయిరీ ఫామ్‌పై సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులతో పాటు కొనుగోలు చేసేందుకు వచ్చిన నలుగురు వినియోగదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.57 వేలుగా అంచనా వేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన సంచిత్ రాయ్ (50) సుమారు పదేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. తొలుత గుమ్మడిదలలోని ఓ డెయిరీ ఫామ్‌లో మూడేళ్లపాటు పనిచేశాడు. అనంతరం గత మూడేళ్లుగా కర్దనూర్‌లోని గోవిందరావు డెయిరీ ఫామ్‌లో నెలకు రూ.20 వేల జీతంతో పనిచేస్తున్నాడు. మరో నిందితుడు మహేష్ కుమార్ (32) రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి గోవిందరావు డెయిరీ ఫామ్‌కు ఎదురుగా ఉన్న దేవి పార్కింగ్ యార్డులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గత ఏడాది కాలంగా సన్చిత్ రాయ్‌తో కలిసి గంజాయి విక్రయాలకు సహకరిస్తున్నాడు.

డెయిరీ ఫామ్‌ను అడ్డాగా చేసుకుని దందా

గోవిందరావు గతంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. ఉద్యోగం కోల్పోయిన అనంతరం ఆర్థిక సహాయం తీసుకుని డెయిరీ ఫామ్‌ను ఏర్పాటు చేశాడు. పశువుల సంరక్షణ, ఫామ్‌కు సంబంధించిన పనుల కోసం సంచిత్ రాయ్ సహా పలువురిని నియమించుకున్నాడు. అయితే ఫామ్ యజమాని ఉదయం కొన్ని గంటలు మాత్రమే అక్కడికి వచ్చి వెళ్లడాన్ని ఆసరాగా చేసుకున్న నిందితులు, డెయిరీ ఫామ్ పరిసరాలను గంజాయి విక్రయాలకు ఉపయోగించుకోవడం ప్రారంభించారు.

ధూల్‌పేట్ నుంచి గంజాయి సరఫరా

సంచిత్ రాయ్‌కు బీహార్‌లో ఉన్నప్పటి నుంచే గంజాయి వినియోగించే అలవాటు ఉంది. గుమ్మడిదలలో పనిచేస్తున్న సమయంలో హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌కు చెందిన కిషన్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. అతని వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేయడం ప్రారంభించాడు. కర్దనూర్‌కు మారిన తర్వాత కూడా కిషన్ సింగ్ నుంచే గంజాయి తెప్పించుకునేవాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్న బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు సాగించాడు. కిలో గంజాయిని రూ.20 వేల చొప్పున కొనుగోలు చేసి, ఐదు గ్రాముల చొప్పున చిన్న ప్యాకెట్లుగా తయారు చేసేవాడు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.300కు విక్రయించేవాడు. ఈ విక్రయాల్లో మహేష్ కుమార్ సహకరించేవాడు.

రోజుకు 20 నుంచి 30 మంది కస్టమర్లు

ప్రారంభంలో చిన్న స్థాయిలో, పార్ట్‌టైమ్‌గా ప్రారంభించిన ఈ గంజాయి వ్యాపారం క్రమంగా విస్తరించింది. గత ఏడాది కాలంగా సంచిత్ రాయ్ స్థానికంగా గంజాయి వినియోగదారులకు పరిచయమయ్యాడు. రోజుకు సగటున 20 నుంచి 30 మంది వరకు అతని వద్దకు వస్తుండగా, ఆదివారాల్లో ఈ సంఖ్య 50 నుంచి 60 వరకు ఉంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వినియోగదారులు మొబైల్ ఫోన్ ద్వారా నిందితులను సంప్రదించేవారు. అనంతరం డెయిరీ ఫామ్‌కు కొంత దూరంలోని ప్రదేశానికి రావాలని సూచించి, రోడ్డు పక్కన గంజాయి ప్యాకెట్లను అందజేసి నగదు రూపంలో డబ్బులు వసూలు చేసేవారు. వారానికి రెండు మూడు సార్లు కిషన్ సింగ్ నుంచి ఒకటి నుంచి రెండు కిలోల చొప్పున గంజాయి తెప్పించుకునేవారు.

పోలీసుల దాడితో గంజాయి దందాకు బ్రేక్

అక్టోబర్ 31న సంచిత్ రాయ్, మహేష్ కుమార్ గంజాయి విక్రయిస్తున్న సమయంలో ఈగల్ ఫోర్స్, పటాన్‌చెరు పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఇద్దరు నిందితులను, నలుగురు వినియోగదారులను పట్టుకున్నారు. అదనంగా మరో పది మంది వినియోగదారులను కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి సరఫరాదారుగా భావిస్తున్న ధూల్‌పేట్‌కు చెందిన కిషన్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో NDPS చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: ఈగల్ ఫోర్స్ విజ్ఞప్తి

యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈగల్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది. డ్రగ్స్‌కు అలవాటుపడిన యువత నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదం ఉందని, ఇప్పటికే అనేక కుటుంబాలు ఈ మాదకద్రవ్యాల సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించింది. డ్రగ్స్ విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు 8712671111 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని కోరింది. డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని ఈగల్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది.

Follow Us
బాన్సువాడలో నాటు బాంబుల పేలుడు.. ఆరుగురికి సీరియస్!
బాన్సువాడలో నాటు బాంబుల పేలుడు.. ఆరుగురికి సీరియస్!
బయటకు డెయిరీ ఫామ్.. లోపల మత్తు దందా..
బయటకు డెయిరీ ఫామ్.. లోపల మత్తు దందా..
హాఫ్ సెంచరీ తర్వాత వింత సెలబ్రేషన్స్.. అసలేంటీ ‘మాన వేవ్’ స్టోరీ
హాఫ్ సెంచరీ తర్వాత వింత సెలబ్రేషన్స్.. అసలేంటీ ‘మాన వేవ్’ స్టోరీ
సీతగా సాయి పల్లవి.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
సీతగా సాయి పల్లవి.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
మందార పూలతో ఇంట్లోనే నేచురల్ హెయిర్ కండిషనర్ తయారీ.. రఫ్‌గా ఉన్న
మందార పూలతో ఇంట్లోనే నేచురల్ హెయిర్ కండిషనర్ తయారీ.. రఫ్‌గా ఉన్న
వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు
వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు
ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల
ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా