Air India Sale: ఎయిర్ ఇండియాను దక్కించుకోనున్న టాటా సన్స్.. 68 సంవత్సరాల తరువాత మళ్లీ..

చరిత్ర పునరావృతం అవుతుందా..? మరోసారి ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ దక్కించుకోనుందా..? అవును అనే తెలుస్తోంది.

Air India Sale: ఎయిర్ ఇండియాను దక్కించుకోనున్న టాటా సన్స్.. 68 సంవత్సరాల తరువాత మళ్లీ..
Air India
Follow us

|

Updated on: Oct 01, 2021 | 2:23 PM

చరిత్ర పునరావృతం అవుతుందా..? మరోసారి ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ దక్కించుకోనుందా..? అవును అనే తెలుస్తోంది. భారత్‌లో టాటా గ్రూప్ ఇప్పటికే రెండు ఎయిర్ లైన్స్ నిర్వహిస్తోంది. వీటిలో ఒకటి సింగపూర్ ఎయిర్ లైన్స్, ఇంకొకటి ఎయిర్ ఏసియాతో జాయింట్ వెంచర్. న్యూస్ ఏజెన్సీ బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ప్యానెల్ ఎయిర్ ఇండియా కోసం టాటా గ్రూప్‌ను ఎంపిక చేసింది. టాటా గ్రూప్‌కు చెందిన అజయ్ సింగ్, స్పైస్ జెట్ ఎయిర్ ఇండియా కోసం బిడ్ చేశారు. నివేదిక ప్రకారం ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.

ఎయిర్ ఇండియాను ఎందుకు అమ్మేసింది ?

పార్లమెంటులో ఒక ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక గణాంకాల ప్రకారం ఎయిర్ ఇండియా మొత్తం రూ .38,366.39 కోట్ల అప్పు ఉందని ప్రభుత్వం పేర్కొంది.

ఎయిర్ ఇండియాలో మొత్తం ఎన్ని ఆస్తులు ఉన్నాయి?

31 మార్చి 2020 నాటికి ఎయిర్ ఇండియా మొత్తం స్థిర ఆస్తులు దాదాపు రూ .45,863.27 కోట్లు. ఇందులో ఎయిర్ ఇండియా ల్యాండ్, బిల్డింగ్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లీట్ ఇంజిన్‌లు ఉన్నాయి.

ఎయిర్ ఇండియా ఉద్యోగుల పరిస్థితి ఏంటి?

మార్గదర్శకాల ఆధారంగా ఎయిర్ ఇండియా ఉద్యోగుల ప్రయోజనాలను పూర్తిగా ప్రభుత్వం చూసుకుంటుందని పార్లమెంటులో కేంద్రం తెలిపింది.

68 సంవత్సరాల తరువాత మళ్లీ టాటా చేతికి ఎయిర్ ఇండియా..

ఎయిర్ ఇండియా గతంలో టాటా గ్రూప్ కంపెనీ. ఈ కంపెనీని 1932 లో JRD టాటా స్థాపించారు. స్వాతంత్ర్యం తరువాత  విమానయాన రంగం జాతీయం చేయబడింది. దీని కారణంగా ప్రభుత్వం టాటా ఎయిర్‌లైన్స్  49 శాతం వాటాలను కొనుగోలు చేసింది. తరువాత ఈ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. జూలై 29, 1946 న ఎయిర్ ఇండియాగా పేరు మార్చబడింది. 1953 లో ప్రభుత్వం ఎయిర్ కార్పొరేషన్ చట్టాన్ని ఆమోదించింది. కంపెనీ వ్యవస్థాపకుడు JRD టాటా నుండి యాజమాన్య హక్కులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ తరువాత కంపెనీకి మళ్లీ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. ఈ విధంగా టాటా గ్రూప్ 68 సంవత్సరాల తర్వాత మరోసారి సొంత కంపెనీని తిరిగి పొందింది.

ఎయిర్ ఇండియా వివరణ..

మీడియా కథనలపై ఎయిర్ ఇండియా ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది..

ఇవి కూడా చదవండి:  SBI Car Loan: కారు కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. జీరో ప్రాసెసింగ్ ఛార్జ్.. ఇంట్లో కూర్చుని తీసుకోండి..

TS RTC: సాహో సజ్జనార్.. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు..