ఆ యాప్ టీనేజ్ అమ్మాయిలకు సమస్యగా మారిందా..! అందుకే నిలిపివేశారా..?
Facebook Instagram: Facebook పిల్లల కోసం Instagram Kids aap ని యాప్‌ని ప్రారంభించబోతోంది. అయితే దీనిపై చాలా విమర్శలు రావడంతో ప్రస్తుతానికి నిలిపివేశారు.
Facebook Instagram: Facebook పిల్లల కోసం Instagram Kids aap ని యాప్‌ని ప్రారంభించబోతోంది. అయితే దీనిపై చాలా విమర్శలు రావడంతో ప్రస్తుతానికి నిలిపివేశారు.13 ఏళ్లలోపు పిల్లల కోసం దీనిని తయారు చేశారు. అయితే చైల్డ్ ప్రొటెక్షన్ అథారిటీలు, పిల్లల తల్లిదండ్రులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది పిల్లలకు ప్రమాదకరమని వాదించారు. Instagram Kids aap ఏ విధంగా పిల్లలకు ప్రమాదంగా మారుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రముఖ వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. సోషల్ మాద్యమాల వల్ల యువత చెడు ప్రభావానికి గురవుతున్నారని, మానసికవేదన అనుభవిస్తున్నారని తెలిపింది. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ప్రకటించింది. ఇదిలా ఉంటే కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ యాప్ టీనేజ్ అమ్మాయిలకు చాలా ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల అమ్మాయిల ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయని, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. అంతేకాదు బాలికలపై లైంగిక వేధింపులు పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
13 శాతం మంది బ్రిటిష్, 6 శాతం అమెరికన్ టీనేజ్ వినియోగదారులపై సర్వే కూడా నిర్వహించారు. ఇందులో వారు డిఫ్రెషన్‌కి గురవుతున్నారని తేలింది. అయితే ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ‘ఆడమ్ మోసెరి’ ఈ విషయాలన్నింటిని ఖండించారు. ఇన్ స్టాగ్రామ్ కిడ్స్ వెర్షన్ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆడమ్ వివరణ ఇచ్చారు. ఇప్పటికే ఈ కిడ్స్ యాప్ పై చాలా అభ్యంతరాలు వస్తున్నాయని, అందుకే ముందుగా తల్లిదండ్రులు, మేధావులు, విశ్లేషకులు, పాలసీ మేకర్స్, నియంత్రణ విభాగాల నుంచి పూర్తి స్థాయి ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నట్టు తెలిపారు. ఆ తర్వాతే కిడ్స్ ఇన్‌స్టాగ్రామ్‌ను లాంచ్ చేస్తామని వెల్లడించారు. ఈ వెర్షన్‌లో పేరెంటింగ్ టూల్ ఉంటుందని తెలిపారు. అలాగే పిల్లల యాక్టివిటీస్‌ను నిరంతరం పెద్దలు మానిటర్ చేస్తుండవచ్చునని పేర్కొన్నారు.