AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మారెట్లు.. పెట్టుబడికి ఇదే సరైన సమయమా..!

భారత స్టాక్ మార్కెట్లు వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 361 పాయింట్లు కోల్పోయి 58,765 వద్ద స్థిరపడింది...

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మారెట్లు.. పెట్టుబడికి ఇదే సరైన సమయమా..!
Stocks
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 01, 2021 | 5:03 PM

భారత స్టాక్ మార్కెట్లు వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 361 పాయింట్లు కోల్పోయి 58,765 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 86 పాయింట్ల నష్టంతో 17,532 వద్దకు చేరింది. గత నాలుగు రోజుల నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగుస్తున్నాయి. ఉదయం 58, 404 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఓ దశలో 58,890 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరి.. 58,551 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది. నిఫ్టీ 17,557 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,452 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలు నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్థిక, ఐటీ, టెలికాం షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

ఎం&ఎం, డాక్టర్ రెడ్డీస్​, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్​గ్రిడ్​, సన్​ఫార్మా, మేగ్‎మణి ఫిన్‎క్యామ్ షేర్లు లాభాలను గడించాయి. బజాజ్ ఫినాన్స్​, మారుతీ సుజుకీ, ఏషియన్​ పెయింట్స్​, బజాజ్ ఫినాన్స్, భారతీ ఎయిర్​టెల్ ప్రధానంగా నష్టపోయాయి. ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. నిక్కీ (జపాన్​), కోస్పీ (దక్షిణ కొరియా) సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి

గత నాలుగు రోజులుగా మార్కెట్లు నష్టాల్లో ముగియటంతో పెట్టుబడికి ఇదే సరైన సమయమని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ ఇంకా పడే అవకాశం ఉంటే దశలవారీగా పెట్టుబడి పెట్టాలన్నారు. స్టాక్ ప్రైస్ ఆధారంగా కాకుండా కంపెనీ లాభాలు, అప్పులు, యాజమాన్యం పని తీరుబట్టి కంపెనీలు ఎంచుకుని పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఇలా సాధ్యం కానీ పక్షంలో మ్యూచవల్ ఫండ్స్ ఎంచుకోవడం ఉత్తమమని చెప్పారు. మ్యూచవల్ ఫండ్స్‎లో కనీసం 5 నుంచి 8 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్, మ్యూచవల్ ఫండ్స్ రెండింటిలో రిస్క్ ఉంటుందన్నారు.

Read Also.. ఆ యాప్ టీనేజ్‌ అమ్మాయిలకు సమస్యగా మారిందా..! అందుకే నిలిపివేశారా..?