Cotton: తెల్లబంగారానికి పెరుగుతున్న డిమాండ్.. క్వింటాకు రూ.7 వేల పైనే.. సామాన్యులకు షాక్..

దేశంలో పత్తికి డిమాండు పెరుగుతోంది. దీంతో దాని ధర పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి ధర ఏకంగా పదేళ్ల గరిష్టాన్ని తాకడం గమనార్హం. ఇక...

Cotton: తెల్లబంగారానికి పెరుగుతున్న డిమాండ్.. క్వింటాకు రూ.7 వేల పైనే.. సామాన్యులకు షాక్..
Cotton
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 01, 2021 | 6:37 PM

దేశంలో పత్తికి డిమాండు పెరుగుతోంది. దీంతో దాని ధర పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి ధర ఏకంగా పదేళ్ల గరిష్టాన్ని తాకడం గమనార్హం. ఇక… ఈ ఏడాది కాటన్ ధర మరింత పెరిగే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. పత్తి సాగు తక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. దసరాకు ముందు కాటన్ సహా పలు బ్రాండ్‌ల దుస్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో టెక్స్‌టైల్ కంపెనీలకు ప్రయోజనం కలగనుంది. సామాన్యులపై భారం  పెరుగనుంది.

దేశంలో గతేడాది పత్తి సాగుతో పోలిస్తే… ఈసారి పత్తి సాగు ఆరు శాతం మేర తగ్గింది. అంచనా వేసిన ఉత్పత్తి కన్నా పత్తి తక్కువగా ఉన్న నేపథ్యలో ధరలు 10-12 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం పత్తి ధర క్వింటాల్‌కు రూ. 7 వేల వరకు ఉంది. ప్రభుత్వ ధర రూ. 5,725. కాగా… భారీ వర్షాల అమెరికాలో పత్తి సాగు దెబ్బతింది. మరోవైపు చైనాలో కాటన్‌కు ఫుల్ డిమాండ్ నెలకొంది. ఈ పరిణామాల పత్తికి డిమాండ్ భారీగా పెరగనుంది. మండీలలో పత్తి ధర క్వింటాల్‌కు రూ.6,500 కు పైనే ఉంది.

సెప్టెంబర్ 22న వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‎లో పత్తి భారీ ధర పలికింది. క్వింటాకు రూ.7,610లకు అమ్ముడుపోయింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పాత పత్తి కి రూ.8,210 ధర రికార్డు కాగా కొత్త పత్తికి రూ.7,610 అని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.5,825 కాగా… అంతకంటే రూ.1,785 ధర అధికంగా పలకడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో పత్తి సాగు భారీగా పడిపోయింది. దాదాపు రైతులందరూ వరి వేశారు. పత్త సాగు చేసినా వర్షాలకు దెబ్బతినటంతో దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉంది.

Read Also.. Air India Sale: ఎయిర్ ఇండియాను దక్కించుకోనున్న టాటా సన్స్.. 68 సంవత్సరాల తరువాత మళ్లీ..