Oppo A55: ఒప్పో50 మెగాపిక్సెల్ కెమెరాతో స్మార్ట్ ఫోన్ రిలీజ్.. అమెజాన్‌లో 3000 రూపాయల తగ్గింపు
Oppo A55: ఒప్పో ఇండియాలో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ Oppo A55ని విడుదల చేసింది. A55 పంచ్-హోల్ డిజైన్, 50 మెగాపిక్సెల్ కెమెరా, మీడియాటెక్ ప్రాసెసర్, పెద్ద
Oppo A55: ఒప్పో ఇండియాలో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ Oppo A55ని విడుదల చేసింది. A55 పంచ్-హోల్ డిజైన్, 50 మెగాపిక్సెల్ కెమెరా, మీడియాటెక్ ప్రాసెసర్, పెద్ద డిస్‌ప్లేతో వస్తుంది. Oppo A సిరీస్ ఇటీవల బడ్జెట్‌లో లభించే విధంగా 5G ఫోన్‌లను ప్రవేశపెట్టింది. అయితే తాజా A55 అందులో ఒకటి కాదు. ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా విక్రయానికి వస్తుంది. తాజా A55 రెనో సిరీస్ నుంచి కొన్ని డిజైన్లను కాపీ చేసింది. ఒప్పో ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 సాఫ్ట్‌వేర్ కూడా ఉంటుంది. అంటే మీరు సరికొత్త ఫీచర్లను పొందుతారు.
ధర.. Oppo A55 రెండు వేరియంట్లలో వస్తుంది. 4GB RAM, 64GB స్టోరేజ్ ధర రూ .15,490. మరొకటి 6GB RAM, 128GB స్టోరేజ్ ధర రూ.17,490. ఫోన్ రెయిన్‌బో బ్లూ, స్టారీ బ్లాక్ కలర్‌లో వస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో ఫోన్ బేస్ వేరియంట్ మాత్రమే కొనుగోలు కోసం అందుబాటులో ఉంటుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేదా EMI ఎంపికను ఉపయోగించి 3,000 ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది. ఫోన్ కొనుగోలుతో మూడు నెలల ఉచిత అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ అమెజాన్ కస్టమర్లందరికీ వర్తిస్తుంది.
అయితే ప్రైమ్ మెంబర్‌లకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI, ఆరు నెలల్లో స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఎంపికను పొందుతారు. ఒప్పో A55 ని కొనుగోలు చేసేవారు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డును ఉపయోగించి మూడు నెలల వరకు రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ EMI పొందవచ్చు. మీరు Oppo ఆన్‌లైన్ స్టోర్ నుంచి Oppo A55 ను కొనుగోలు చేస్తే మీరు కోటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్ నుంచి10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందుతారు. మూడు నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపిక ఉంది.
ఫోన్ ఫీచర్లు ఒప్పో A55 పంచ్-హోల్ డిజైన్‌తో 6.51-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ పంచ్ హోల్ లోపల 5 పి లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్ 2.3GHz క్లాక్ స్పీడ్‌తో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇందులో మీరు 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ పొందవచ్చు. అదే సమయంలో మీకు 256 GB వరకు మైక్రో SD కార్డు సపోర్ట్ దొరుకుతుంది. USB OTG కి మద్దతు కూడా ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా కలర్‌ఓఎస్ 11 పై ఫోన్ పనిచేస్తుంది.