Looted Eggs: లారీని చోరీ చేసిన దుండగులు.. అందులో ఏమున్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

వాహనాలు, సెల్ ఫోన్లు, విలువైన వస్తువులు తరలిస్తున్న కంటైనర్ చోరీకి గురయిన ఘటనలు గతంలో చూశాం. కానీ విచిత్రంగా ఓ లారీని...

Looted Eggs: లారీని చోరీ చేసిన దుండగులు.. అందులో ఏమున్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Lorry
Follow us

|

Updated on: Oct 01, 2021 | 7:10 PM

వాహనాలు, సెల్ ఫోన్లు, విలువైన వస్తువులు తరలిస్తున్న కంటైనర్ చోరీకి గురయిన ఘటనలు గతంలో చూశాం. కానీ విచిత్రంగా ఓ లారీని చోరీ చేశారు కొందరు దుండగులు. అందులో ఏమున్నాయంటే.. కోడి గుడ్లు.. అవును మీరు విన్నది నిజమే కోడి గుడ్లు తీసుకెళ్తున్న లారీని కొందరు దుండగులు లూటీ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‎లో జరిగింది. ఐదుగురు సభ్యుల ముఠా కోడి గుడ్లు తరలిస్తున్న లారీని చోరీ చేశారు. కోడి గుడ్ల లోడ్‌తో వస్తున్న లారీని చోరీ చేస్తే రిస్క్ ఉండదనుకున్నారో ఏమో గానీ పక్కా ప్లాన్‌తో లారీని చోరీ చేశారు. హర్యానాలోని సోనిపట్ నుంచి లారీ వస్తుండగా ఈ ఘటన జరిగింది. హర్యానా-ఉత్తరప్రదేశ్‌లో సరిహద్దులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముఠా కోడి గుడ్ల లారీని చోరీ చేయడమే కాదు అందులో ఉన్న కోడి గుడ్లను రూ.4.10 లక్షలు అమ్మేశారు. కోడిగుడ్లు అమ్మగా వచ్చిన రూ.4.10 లక్షల డబ్బును, కోడిగుడ్లు నింపిన 47 ప్లాస్టిక్ క్రేట్లు, 60 ఎగ్ ట్రేలను పోలీసులు సీజ్ చేశారు. అంతేకాదు.. లారీ డ్రైవర్‌ను బెదిరించడానికి నిందితుడు నాటు తుపాకులు, కత్తులు వాడారు. నిందితులు వాడిన రెండు నాటు తుపాకులు, కత్తులు, చోరీ సమయంలో లారీని ఛేజ్ చేసేందుకు వాడిన కారును స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 13న ఈ ఘటన జరగ్గా.. సెప్టెంబర్ 14న సోనిపట్‌లోని కొండ్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నిందితులను గురువారం సిర్సా కట్ దగ్గర కస్నా పోలీస్ స్టేషన్ అధికారులు పట్టుకున్నారని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (గ్రేటర్ నోయిడా) విశాల్ పాండే చెప్పారు.

ఈ చోరీకి పాల్పడిన నిందితులను సాహిల్, ఫిరోజ్, నదీమ్, తుషార్, విక్రమ్‌లుగా పోలీసులు గుర్తించారు. వీళ్లంతా గ్రేటర్ నోయిడా పరిధిలోని కుల్సేరా గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ యూపీ గ్యాంగ్‌పై గతంలోనే పలు కేసుల్లో అర డజనుకు పైగా కేసులు నమోదయ్యాయి. వీరిపై వివిధ పోలీసు స్టేషన్లలో ఇప్పటికే అర డజనుకు పైగా కేసులు ఉన్నాయి.

Read Also.. Crime News: మ్యాట్రీమోనీ అడ్డగా వాడి ఆట.. బాధితుల ఫిర్యాదుతో పోలీసుల వేట.. చివరికి తిరుపతిలో..