Crime News: మ్యాట్రీమోనీ అడ్డగా వాడి ఆట.. బాధితుల ఫిర్యాదుతో పోలీసుల వేట.. చివరికి తిరుపతిలో..
Crime News: ఒంటరి మహిళలే టార్గెట్‌గా ఘరానా మోసాలకు పాల్పడుతూ.. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న కిలాడీ కిరణ్‌ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు.
Crime News: ఒంటరి మహిళలే టార్గెట్‌గా ఘరానా మోసాలకు పాల్పడుతూ.. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న కిలాడీ కిరణ్‌ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. తిరుపతిలో సంచరిస్తున్న కిరణ్‌ను.. పక్కా పథకం ప్రకారం పట్టుకున్నారు. అసలు మ్యాటర్‌లోకి వెళితే.. కిలాడి కిరణ్ మాట్రిమోనీ ఆధారంగా మహిళలను ట్రాప్ చేసేవాడు. మ్యాట్రిమోనీలో పరిచయం చేసుకుని, వారి నుంచి డబ్బులు దండుకునేవాడు. ముఖ్యంగా ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని వారిని తన మాయ మాటలతో బుట్టలో వేసుకునేవాడు. ఆపై ప్రేమ పేరుతో డబ్బులు దండుకున్నాడు. డబ్బులు చేతికి చిక్కగానే.. ఉడాయించేవాడు. ఇలా కరీంనగర్, వరంగల్ జిల్లాలు, హైదరాబాద్‌కు చెందిన పలువురు మహిళలను కిరణ్ మోసం చేశాడు.
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, కిరణ్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతూ వచ్చాడు. తాజాగా కిరణ్ తిరుపతిలో ఉన్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు.. పక్కా ప్లాన్ ప్రకారం అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కిలాడి కిరణ్‌ను నలుగురు పోలీసుల బృందం విచారిస్తోంది. ఎంతమందిని మోసం చేశాడు? ఎంత మంది నుంచి డబ్బులు దండుకున్నాడు? వంటి వివరాలపై కూపీ లాగుతున్నారు.
Also read:
Elaichi Water Benefits: యాలకుల నీటితో బోలెడు ఉపయోగాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
Watch Video: వికెట్ల కోసం తంటా.. స్లిప్స్‌లో ఎనిమిది మంది.. ఫీల్డింగ్ చూస్తే ఆశ్చర్యపోతారంటే!
Covid Hopsital Fire: రొమేనియా కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 9మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు