AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వికెట్ల కోసం తంటా.. స్లిప్స్‌లో ఎనిమిది మంది.. ఫీల్డింగ్ చూస్తే ఆశ్చర్యపోతారంటే!

Cricket News: సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌ల్లో మనం ఎటాకింగ్ ఫీల్డింగ్‌ను చూస్తుంటాం. వికెట్ల కోసం చాలా జట్లు బ్యాట్స్‌మెన్ చుట్టూ ఫీల్డర్స్‌ను పెట్టి ఏకాగ్రతను..

Watch Video: వికెట్ల కోసం తంటా.. స్లిప్స్‌లో ఎనిమిది మంది.. ఫీల్డింగ్ చూస్తే ఆశ్చర్యపోతారంటే!
England Vs Finland
Ravi Kiran
|

Updated on: Oct 01, 2021 | 5:13 PM

Share

సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌ల్లో మనం ఎటాకింగ్ ఫీల్డింగ్‌ను చూస్తుంటాం. వికెట్ల కోసం చాలా జట్లు బ్యాట్స్‌మెన్ చుట్టూ ఫీల్డర్స్‌ను పెట్టి ఏకాగ్రతను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తాయి. అయితే వన్డేల్లో ఇలాంటి ఫీల్డింగ్ చాలా అరుదు. అయితే ఈ సీన్ వన్డేల్లో కూడా జరిగింది. ఇటీవల ఇంగ్లాండ్ ఎలెవన్, ఫిన్‌ల్యాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆవిష్కృతమైన రేర్ సీన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో చూసేద్దాం పదండి..

ఏదైనా మ్యాచ్ గెలవాలంటే.. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా చాలా అవసరం. గ్రౌండ్‌లో ఫీల్డర్లు ఎంత వేగంగా ఉంటే.. వికెట్లను అంత ఎక్కువగా తీయగలమని చాలా జట్ల నమ్మకం. రనౌట్, క్యాచ్, డైవ్ క్యాచ్ ఇలా అద్భుతాలు ఏవి జరగాలన్నా.. ఫీల్డింగ్ అన్నది అంత గొప్పగా ఉండాలి. మ్యాచ్‌‌ సందర్భం బట్టి ప్రతీ జట్టు ఎటాకింగ్, డిఫెన్సివ్ ఫీల్డింగ్‌లను ప్లేస్‌మెంట్ చేస్తుంటాయి. అయితే తాజాగా యూరోపియన్ లీగ్‌లో కనిపించిన ఫీల్డ్ ప్లేస్‌మెంట్ మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

యూరోపియన్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్ ఎలెవన్, ఫిన్‌ల్యాండ్ మధ్య 10-10 ఓవర్ల మ్యాచ్ జరిగింది. స్పెయిన్‌లోని కార్టమా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఎలెవన్ 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఫిన్‌ల్యాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగారు.

ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో ఫిన్‌ల్యాండ్ బౌలర్ అమ్జద్ షేర్ మొదటి ఓవర్ వేసేందుకు క్రీజులోకి రాగా.. ఆ జట్టు కెప్టెన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 మంది ప్లేయర్స్‌ను స్లిప్స్‌లో.. లెగ్ స్లిప్‌లో ఒక ఫీల్డర్‌ను పెట్టాడు. టెస్టుల్లో నలుగురు లేదా ఐదుగురు ఫీల్డర్స్ ఉండటం కామన్… కానీ ఇక్కడ ఫిన్‌ల్యాండ్ జట్టు ఏకంగా 8 మంది ఆటగాళ్ళను స్లిప్స్‌గా ఇన్నింగ్స్ మొదటి బంతికే పెట్టడం గమనార్హం.