Covid Hopsital Fire: రొమేనియా కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 9మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
రొమేనియా దేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోర్ట్ సిటీ కాన్‌స్టంటాలోని ఒక ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో బాధితులు మరణించినట్లు అధికారులు తెలిపారు.
రొమేనియా దేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోర్ట్ సిటీ కాన్‌స్టంటాలోని ఒక ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో బాధితులు మరణించినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ -19 రోగులకు చికిత్స చేస్తున్న రొమేనియన్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది శుక్రవారం మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.ఈ ఏడాదిలోపే దేశంలో మూడో ఘోరమైన ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సమీపంలోని కౌంటీల నుండి అదనపు బృందాలను రప్పించి ఆసుపత్రిలో మంటలను ఆర్పివేశారు. హాస్పిటల్ కింది ప్లోర్‌లో నుండి రోగులు కిటికీల నుండి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. మరికొందరిని అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకువచ్చి రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదం జరిగినప్పుడు 113 మంది రోగులు ఆసుపత్రిలో ఉన్నారని, వారిలో 10 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నారని తాత్కాలిక ఆరోగ్య మంత్రి సీసీ అటిలా తెలిపారు. మరోవైపు ఆసుపత్రి నుంచి రక్షించిన రోగులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
19 మిలియన్ల జనాభా కలిగిన యూరోపియన్ యూనియన్ దేశమైన రొమేనియాలో ఏడాది కాలంగా మూడు సార్లు ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనతో ఆ దేశంలోని ఆసుపత్రి మౌలిక సదుపాయాల గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. గత నవంబర్‌లో, ఉత్తర పట్టణం పియాట్రా నీమ్‌ట్‌లో COVID-19 రోగుల కోసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మంటలు చెలరేగి 10 మంది మరణించారు. జనవరిలో మరో అగ్నిప్రమాదం బుకారెస్ట్ మేటీ బాల్స్ హాస్పిటల్‌లోని ఒక వార్డ్‌ను చుట్టుముట్టింది.ఈ ప్రమాదంలో 5 మంది మరణించారు.
Read Also…. Huzurabad By Election: సానుభూతి కోసం దాడి నాటకం ఆడబోతున్నారు.. ఈటలపై మంత్రి కొప్పుల సంచలన వ్యాఖ్యలు