Fire Accident: భార్య ఫోన్ చేసి విసిగిస్తోందని.. భర్త చేసిన పనికి షాకైన కాలనీవాసులు..

ఓ వ్యక్తి భార్యతో గొడవపడి వేరుగా ఉంటున్నాడు. దూరంగా ఉంటున్నా భార్య మాత్రం అతనికి ఫోన్ చేస్తోంది. రోజుకు పది నుంచి 20 సార్లు..

Fire Accident: భార్య ఫోన్ చేసి విసిగిస్తోందని.. భర్త చేసిన పనికి షాకైన కాలనీవాసులు..
Fire
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 01, 2021 | 4:40 PM

ఓ వ్యక్తి భార్యతో గొడవపడి వేరుగా ఉంటున్నాడు. దూరంగా ఉంటున్నా భార్య మాత్రం అతనికి ఫోన్ చేస్తోంది. రోజుకు పది నుంచి 20 సార్లు ఫోన్ చేసి విసిగిస్తోందని కోపం పెంచుకున్నాడు అతుడు. ఏదో ఒకటి చేయాలని భార్య ఉంటున్న కాలనీకి వెళ్లాడు.. అతను చేసిన పనికి భార్యతోపాటు ఆ కాలనీవాళ్లు షాకయ్యారు. ఇంతకీ అతను చేసిన పని ఏమిటంటే…

తమిళనాడు చెన్నై అంబత్తూరులోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 26 ఏళ్ల సతీష్‌కు, వెండామనితో కొద్ది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజులు బాగానే సాగిన వారి కాపురంలో చిన్న చిన్న మనస్పర్దలు రావడం మొదలయ్యయి. వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. గొడవలు తీవ్రం కావటంతో అతడు 2019 నుంచి భార్యతో విడిపోయి వేరుగా ఉంటున్నాడు. భర్తతో విడిపోయిన తర్వాత కూడా భార్య వెండామని సతీష్‌కు తరచూ ఫోన్ చేసి విసిగించేది. ఎన్నిసార్లు చెప్పినా భార్య మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తుండటంతో విరక్తి చెందిన సతీష్.. భార్యపై కోపం పెచ్చుకున్నాడు. భార్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని ఓ రోజు రాత్రి ఆమె ఉంటున్న నెర్కుండ్రం షణ్ముఖనగర్ సత్యం వీధికి వెళ్లాడు. కోపంతో ఆమె ద్విచక్ర వాహనానికి నిప్పంటించాడు.

స్కూటీ పక్కనే మరిన్ని వాహనాలు పార్కు చేసి ఉన్నాయి. ఈ వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. నాలుగు బైకులు, ఓకారు ఈ మంటలు అంటుకున్నాయి. మంటలు రావటంతో కాలనీ వాళ్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈలోపు సతీష్ అక్కడి నుంచి జారుకున్నాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సతీష్ అరెస్ట్ చేశారు. భార్యపై కోపంతో ఇదంతా చేశానని చెప్పటంతో పోలీసులు షాక్ అయ్యారు.

Read Also.. Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల స్వాహాలో డొంక కదులుతోంది.. డిపాజిట్ల గోల్‌మాల్‌లో వెలుగులోకి కొత్త కోణం..!