బొప్పాయి ఆకుల్లో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఓ రేంజ్లో ఉంటాయి. కేలరీలు తక్కువ, కానీ విటమిన్లు, మినరల్స్ మాత్రం ఫుల్‌గా ఉంటాయి.
ముఖ్యంగా, ఇమ్యూనిటీ పవర్‌ను పెంచే విటమిన్లు A, C, E, ఎముకలను బలంగా ఉంచే విటమిన్ K, బాడీకి ఎనర్జీ ఇచ్చే B విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా ఉండటంతో, ఈ టీ ఒక కంప్లీట్ న్యూట్రిషన్ డ్రింక్‌గా పనిచేస్తుంది.
ఈ ఆకుల్లోని ఆల్కలాయిడ్స్,ఫ్లేవనాయిడ్స్ వంటి కాంపౌండ్స్‌కు యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీంతో శరీరంలో ఇన్ఫ్లమేషన్ను కంట్రోల్ చేయవచ్చు.
మన బాడీలో కణాలను డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్‌తో నిరంతరం ఫైట్ జరుగుతూనే ఉంటుంది. విటమిన్ C, E, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలం
ఈ డ్రింక్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ల కాంబినేషన్ కొల్లాజెన్ ప్రొడక్షన్‌ను పెంచి, స్కిన్‌ను యంగ్‌గా, ముడతలు లేకుండా ఉంచుతుంది.
తరచూ తాగితే, హానికరమైన అణువులను ఎదుర్కొనే బాడీకి ఒక రెగ్యులర్ బూస్ట్ అందుతుంది. ఇది గుండె జబ్బులు, డయాబెటిస్, కొన్ని క్యాన్సర్ల రిస్క్‌ను తగ్గిస్తుంది.
ఈ కషాయం తాగడం అలవాటు చేసుకుంటే కడుపు ఉబ్బరం, అజీర్తి, మలబద్ధకం వంటి కామన్ ప్రాబ్లమ్స్ తగ్గి, డైజెషన్ ప్రాసెస్ స్మూత్‌గా, కంఫర్టబుల్‌గా ఉంటుంది.