Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైతన్నలకు గుండెకోత.. విద్యుత్ తీగలు తెగిపడి నాలుగు గేదెలు మృతి

అదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాంసీ మండలం పొన్నారి గ్రామంలో గల కె.కె. ఫ్యాక్టరీ పక్కన విద్యుత్ తీగలు తెగి పడి ఉండడంతో..

Telangana: రైతన్నలకు గుండెకోత.. విద్యుత్ తీగలు తెగిపడి నాలుగు గేదెలు మృతి
Representative Image
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 01, 2021 | 6:41 PM

అదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాంసీ మండలం పొన్నారి గ్రామంలో గల కె.కె. ఫ్యాక్టరీ పక్కన విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ ప్రాంతంలో మేతకు వెళ్లిన నాలుగు గేదెలు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైయ్యారు. అక్కడికక్కడే మృతి చెందాయి. తమ కుటుంబానికి జీవనాధారమైన గేదెలు మృతి చెందడంతో ఆ రైతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని గేదెల యజమానులు చింతలపల్లి స్వామి రెడ్డి, అశోక్ రెడ్డిలు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ తీగలు చూడకపోవడమే ఈ ప్రమాదానికి ముఖ్య కారణమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గేదెల విలువ సుమారు రూ.3 లక్షల రూపాయలు ఉంటుందని రైతులు తెలిపారు. ప్రభుత్వ ఉన్నత అధికారులు తమ దయనీయ పరిస్థితిని అర్థం చేసుకొని నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని కోరారు.

అటు ఈ ఘటన పట్ల స్థానిక గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

(నరేష్, ఆదిలాబాద్ జిల్లా, టీవీ9 తెలుగు)

Also Read..

Viral Video: చేపల కోసం ఎర వేసి చూడగా ఊహించని షాక్.. వీడియో చూస్తే గుండె గుభేల్..

ఎనర్జీ డ్రింక్స్’ తాగి స్పృహ తప్పింది.. స్కాన్ చేసి డాక్టర్లు షాక్‌ !