Huzurabad by Poll: కేసీఆర్ బొమ్మతోనే గెలుస్తాం.. అభివృద్ధి ఏంటో చూపిస్తాంః టీఆర్ఎస్.. తొలిరోజే గెల్లు శ్రీను నామినేషన్

హుజూరాబాద్ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మొదటి నుంచి ప్రచారంలో దూకుడు మీద ఉన్న టీఆర్ఎస్ నామినేషన్ ప్రక్రియలోనూ అదే జోరు ప్రదర్శిస్తోంది. తొలిరోజే నామినేషన్ దాఖలు చేశారు అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.

Huzurabad by Poll: కేసీఆర్ బొమ్మతోనే గెలుస్తాం.. అభివృద్ధి ఏంటో చూపిస్తాంః టీఆర్ఎస్.. తొలిరోజే గెల్లు శ్రీను నామినేషన్
Gellu Srinivas Yadav
Follow us

|

Updated on: Oct 01, 2021 | 6:42 PM

Huzurabad by Election: హుజూరాబాద్ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మొదటి నుంచి ప్రచారంలో దూకుడు మీద ఉన్న టీఆర్ఎస్ నామినేషన్ ప్రక్రియలోనూ అదే జోరు ప్రదర్శిస్తోంది. తొలిరోజే నామినేషన్ దాఖలు చేశారు అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్. అటు కాంగ్రెస్ క్యాండిడేట్‌పై ఇంకా స్పష్టత రాలేదు. కమలనాథులు కూడా విస్తృతంగా జనంలోకి వెళ్తున్నారు.

మూడు నెలలుగా తెలంగాణ పాలిటిక్స్‌లో హుజూరాబాదే హాట్‌టాపిక్‌. ఈటల రాజీనామాతో జరుగుతోంది ఈ బైపోల్. ఇక్కడ గెలుపు ఎవరిదనేదానిపై రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రెస్టేజ్ ఇష్యూ కావడంతో ఈ ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుంది అధికార పార్టీ టీఆర్ఎస్. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్‌‌ యాదవ్‌ను బరిలోకి దింపింది. అందరికంటే ముందుగానే అభ్యర్ధిని ప్రకటించింది. నిన్న స్వయంగా పార్టీ బీఫారం కూడా అందజేశారు సీఎం కేసీఆర్. గెల్లు శ్రీనివాస్.. గెలుపు శ్రీనివాస్‌గా తిరిగి వస్తాడంటూ.. భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి. తొలిరోజే ఆ పార్టీ ముఖ్యనేతలంతా వెంటరాగా, నామినేషన్ దాఖలు చేశారు గెల్లు. ఆయన వెంట మంత్రి గంగుల, ప్రభుత్వ విప్ సుమన్‌తోపాటు ఇతర సీనియర్ నేతలు ఉన్నారు.

ప్రచారంలో దూసుకుపోతోంది TRS. కమలాపురం మండలం ఉప్పల్‌లో ప్రచారం నిర్వహించారు. డబ్బు దరువేస్తూ సందడి చేసిన గెల్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమపథకాలే విజయానికి నాందని చెప్పారు. అలాగే, అభివృద్ధి TRS, అబద్ధాల బీజేపీ మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు TRS నేతలు. అందివ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకొని నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయ‌కుండా.. కేసీఆర్‌ను ఎలా వెన్నుపోటు పొడ‌వాలా? అని ఎదురుచూసిన వ్యక్తి ఈట‌ల రాజేంద‌ర్ అని మాజీమంత్రి ఇనుగాలి పెద్దిరెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి ప‌ట్టకుండా నిత్యం వ్యాపారాలు, సెటిల్‌మెంట్లతో బీజీగా ఉన్న ఈట‌ల‌.. ఎప్పుడూ హుజూరాబాద్ అభివృద్ధికి కృషి చేయ‌లేద‌ని అన్నారు. దురుద్దేశంతోనే రాజీనామా చేసి, బీజేపీ జ‌పం చేస్తున్నాడని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఆరోపించారు. నీ ఆత్మగౌరవానికి ఏం భంగం కలిగింది ఈటల రాజేందర్. ఇంత వరకు ఎందుకు చెప్పలేకపోతున్నావంటూ నిలదీశారు వినోద్.

ఇదిలావుంటే, కారు దూసుకుపోతుంతే.. కాంగ్రెస్ చతికిలబడుతోంది. నోటిఫికేషన్ వచ్చినా ఇంకా క్యాండిడేట్‌ను నిర్ణయించలేని దుస్థితి. కమిటీలు వేశారు. రిపోర్టులు ఇచ్చారు. అన్నీ ముగిశాయి. కొండ సురేఖ, కవ్వంపల్లి సత్యనారాయణ, క్రిష్ణారెడ్డి ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయినా క్లారిటీ రాలేదు. కొత్తగా మిత్రపక్షాల మద్దతు కోరుతోంది కాంగ్రెస్. అటు ఉపఎన్నికకు ఇంకా 30 రోజుల సమయమే ఉంది. మరి అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారు? ఎప్పుడు ప్రచారం నిర్వహిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్యాడర్‌లో కూడా కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది..

ఇక, బలమైన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. రాజీనామా తర్వాత నియోజకవర్గంలోనే మకాం వేశారు ఈటల రాజేందర్. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్నారు. రేపు హుస్నాబాద్‌లో ముగింపు సభ కూడా నిర్వహిస్తున్నారు.

Read Also….  షాకింగ్‌.. దేశ వ్యాప్తంగా 94 పాఠశాలల మూసివేత..! కారణాలు ఇలా ఉన్నాయి..