ఎనర్జీ డ్రింక్స్’ తాగి స్పృహ తప్పింది.. స్కాన్ చేసి డాక్టర్లు షాక్ !
అతి ఎప్పుడూ అనర్ధమేనని నానుడి. మనం చేసే పని ఏదైనా కూడా అతిగా చేయకూడదు. అలా అతిగా చేసిన ఓ అమ్మాయి అనారోగ్యం కొని తెచ్చుకుంది. కూల్ డ్రింక్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ మితంగా తాగాలి.
అతి ఎప్పుడూ అనర్ధమేనని నానుడి. మనం చేసే పని ఏదైనా కూడా అతిగా చేయకూడదు. అలా అతిగా చేసిన ఓ అమ్మాయి అనారోగ్యం కొని తెచ్చుకుంది. కూల్ డ్రింక్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ మితంగా తాగాలి. వాటిని మోతాదుకు మించి తాగితే లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి స్విట్జర్లాండ్‌లో చోటు చేసుకుంది. స్విస్ దేశంలోని జ్యూరిచ్ నగరానికి చెందిన ఓ అమ్మాయికి ఎనర్జీ డ్రింక్స్ అంటే మహా ఇష్టం. కనీసం రోజుకు 12 ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంది. ఈ అలవాటు కారణంగా ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. జ్యూరిచ్‌కు చెందిన 17 ఏళ్ల మాషా అనే అమ్మాయికి ఎనర్జీ డ్రింక్స్ తాగడం అంటే చాలా ఇష్టం. చివరికి అది ఆమెకి ఒక వ్యసనంగా మారింది. దీంతో రోజుకి కనీసం 12 బాటిళ్ల ఎనర్జీ డ్రింక్ తాగుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: చేపల కోసం ఎర వేసి చూడగా ఊహించని షాక్.. వీడియో చూస్తే గుండె గుభేల్..