Viral Video: వీళ్ల తెలివికి జోహార్లు.. కుక్కర్ విజిల్‌కు బదులుగా ఏం వాడారో చూస్తే షాకవుతారు..! వైరలవుతోన్న వీడియో
ఇద్దరు మహిళలు కుక్కర్‌లో ఆహారాన్ని వండుతున్నారు. అయితే వారి కుక్కర్‌కు విజిల్ లేదు. దాని బదులుగా వారు తుపాకీతో వంట పూర్తి చేశారు.
Viral Video: ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా జుగాడ్ వీడియోలు చేయడం, అవి నెట్టింట్లో వైరల్ కావడం చూస్తున్నాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా వేగంగా తిరుగుతుంటాయి. ఏదైనా అసాధ్యమైన పనిని సుసాధ్యం చేయగల మార్గం ఏదైనా ఉందంటే అది జుగాడ్ అని మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు. ఈ వీడియోలో మహిళలు ఆహారాన్ని వండడం చూస్తే నిజంగా వీళ్ల తెలివికి జోహర్లు చెప్తారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు మహిళలు కుక్కర్‌లో ఆహారం వండుతున్నట్లు చూడొచ్చు. అయితే వారి కుక్కర్‌కు విజిల్ లేదు. దీంతో కుక్కర్ విజిల్‌కు బదులుగా తుపాకీతో వారు వంటను పూర్తి చేశారు. విజిల్ స్థానంలో తుపాకిని ఉంచారు. వీడియోలో మహిళలు సైనికుల యూనిఫాం ధరించి కనిపించారు. నెటిజన్లను ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది. దానికి కామెంట్లు కూడా పంచుకుంటున్నారు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో jugaadu_life_hacks అనే అకౌంట్‌లో షేర్ చేశారు. ‘మిలిటరీ ఉమెన్స్ జుగాడ్’ అని క్యాప్షన్ అందించారు. ఈ వీడియో ఇప్పటివరకు అనేక మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేశారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు మహిళలు యూనిఫాంలో కనిపిస్తారు. వారి చేతిలో తుపాకీ కనిపిస్తుంది. అదే సమయంలో ఆ ఇద్దరు స్త్రీలు స్టవ్‌పై ప్రెజర్ కుక్కర్‌పై వంట చేస్తుంటారు. దాని నుంచి ఆవిరి బయటకు వస్తోంది. కొంత సమయం తరువాత వారిలో ఒకరు ప్రెజర్ కుక్కర్ విజిల్ ఉన్న ప్రదేశంలో తుపాకీ బారెల్‌ను ఉంచి దానిని పట్టుకుని నిలబడ్డారు. ఈ సమయంలో ఇద్దరు మహిళలు కూడా తమ ముఖాలను కప్పుకుని దానిని పట్టుకుంటారు. ఈ వీడియోను చూసిన తర్వాత ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ‘గ్రేట్ జుగాడ్ హై’ అని కొంతమంది కామెంట్లు చేశారు.
View this post on Instagram
Also Read: Viral Video: జ్యూస్‌లు, వంటల చేస్తున్న పిల్లి.. ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
Viral Video: వామ్మో వీడేం డ్రైవర్రా బాబు.. రాంగ్ రూట్‌లో వచ్చాడని అడ్డుకుంటే ఇలా చేశాడు..