AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడు ఆర్థిక మంత్రికి చెన్నై విమానాశ్రయంలో అవమానం.. ఏం జరిగిందంటే?

Chennai Airport: చెన్నై విమానాశ్రయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్‌కు విమానాశ్రయంలో అవమానం జరిగింది. రెండు ల్యాప్‌టాప్‌లతో ప్రయాణిస్తున్న ఆయన్ను విమానం ఎక్కేందుకు అనుమతించేది లేదంటూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) అధికారులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది.

తమిళనాడు ఆర్థిక మంత్రికి చెన్నై విమానాశ్రయంలో అవమానం.. ఏం జరిగిందంటే?
Chennai AirportImage Credit source: PTI
Janardhan Veluru
|

Updated on: Apr 26, 2025 | 1:22 PM

Share

Chennai Airport: చెన్నై విమానాశ్రయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్‌కు విమానాశ్రయంలో అవమానం జరిగింది. రెండు ల్యాప్‌టాప్‌లతో ప్రయాణిస్తున్న ఆయన్ను విమానం ఎక్కేందుకు అనుమతించేది లేదంటూ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) అధికారులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. ఒకే టాప్‌టాప్‌తో విమానంలో ప్రయాణించేందుకు అనుమతి ఇస్తామని భద్రతా అధికారులు తెగేసి చెప్పడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.  గురువారం వేకువజామున ఐదున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

చెన్నై నుంచి ట్యూటికోరిన్ వెళ్లేందుకు మంత్రి పళనివేల్ త్యాగరాజన్.. సాధారణ ప్రయాణీకులానే చెన్నై విమానాశ్రయంలోని డెమెస్టిక్ టెర్మినల్‌కు చేరుకున్నారు. భద్రతాపరమైన స్కానింగ్ కోసం తన బ్యాగును భద్రతా సిబ్బందికి ఇచ్చారు. బ్యాగులో రెండు ల్యాప్‌టాప్‌లు ఉన్నట్లు గుర్తించిన సీఐఎస్ఎఫ్ అధికారులు.. ఒక ప్రయాణీకుడు ఒక ల్యాప్‌టాప్‌ను మాత్రమే తీసుకుని వెళ్లొచ్చని స్పష్టంచేసినట్లు సమాచారం. రెండు ల్యాప్‌టాప్‌లు తీసుకెళ్లేందుకు నిబంధనలు అనుమతించవని మంత్రికి తెగేసిచెప్పినట్లు తెలుస్తోంది. అయితే అలాంటి నిబంధన లేవంటూ సీఐఎస్ఎఫ్ అధికారులతో మంత్రి పళనివేల్ త్యాగరాజన్ వాగ్వివాదానికి దిగారు.

కాస్త ఆలస్యంగా అయినా..ఆయన సాక్షాత్తు రాష్ట్ర మంత్రి అన్న అసలు విషయం తెలుసుకున్నారు సీనియర్ విమానాశ్రయ అధికారులు. వెంటనే అక్కడకు చేరుకుని మంత్రికి క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. సీఐఎస్ఎఫ్‌ అధికారులకు తమిళ్ అర్థంకానందునే వివాదం ఏర్పడినట్లు విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. ల్యాప్‌టాప్ బ్యాగును ట్రేలో పెట్టాలని ఉత్తరాదికి చెందిన సీఐఎస్ఎఫ్ సబ్ ఇనిస్పెక్టర్ హిందీలో మంత్రికి సూచించారని.. దీన్ని మంత్రి మరోరకంగా అర్థం చేసుకున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫూటేజీని పరిశీలించగా.. స్కానింగ్ దగ్గర ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని అధికారులు తెలిపారు. విమానాశ్రయ సీనియర్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని.. మంత్రికి క్షమాపణ చెప్పినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపారు.

గత ఏడాది ఆగస్టు మాసంలో చెన్నై విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి తనను అవమానించినట్లు డీఎంకే ఎంపి కనిమొళి ఆరోపించడం తెలిసిందే. ఇంగ్లీష్ లేదా తమిళ్‌లో మాట్లాడాలని తాను సీఐఎస్ఎఫ్ అధికారిని కోరగా.. మీరు భారతీయులేనా అని సదరు అధికారి ప్రశ్నించినట్లు అప్పట్లో కనిమొళి ఆరోపించడం సంచలనం సృష్టించింది. తమిళ భాషను గుర్తించకపోవడం తమ భాషకు జరిగిన అవమానంగా ఆమె ఆరోపించారు. దీనిపై సీఐఎస్ఎఫ్ అధికారులు విచారణకు ఆదేశించారు.

Also Read..

Apple Smart Watch: వ్యక్తి ప్రాణాలు కాపాడిన యాపిల్ స్మార్ట్ ఫోన్.. మ్యాటర్ తెలిస్తే ఔరా అంటారు..!

Viral Photo: మీ కళ్లకు పదును పెట్టండి.. ఫోటోలోని మంచు చిరుతను కనిపెట్టండి.!

Soujanya Suicide: ఆ నటి సూసైడ్ వెనుక రీజనేంటి.. సంచలనంగా మారిన సౌజన్య మృతి