AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covishield: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్.. విదేశీ ప్రయాణాలపై ప్రధాని స్కాట్ మోరిసన్ కీలక ప్రకటన!

Covishield Vaccinde: స్వదేశీపరిజ్ఞానంతో తయారు చేసిన భారత వ్యాక్సిన్ కొవిషీల్డ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో ‘కొవిషీల్డ్‌’ టీకాను అధికారికంగా గుర్తించిన దేశాల జాబితాలో పెరుగుతోంది.

Covishield: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్.. విదేశీ ప్రయాణాలపై ప్రధాని స్కాట్ మోరిసన్ కీలక ప్రకటన!
Covishield Vaccine
Balaraju Goud
|

Updated on: Oct 01, 2021 | 4:30 PM

Share

Australia on Covishield: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్న నిపుణుల సూచనల మేరకు టీకా తయారీ ఉపందుకుంది. ఈ క్రమంలో స్వదేశీపరిజ్ఞానంతో తయారు చేసిన భారత వ్యాక్సిన్ కొవిషీల్డ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో ‘కొవిషీల్డ్‌’ టీకాను అధికారికంగా గుర్తించిన దేశాల జాబితాలో పెరుగుతోంది. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా కొవిడ్‌షీల్డ్ వ్యా్క్సిన్‌కు ఆమోద ముద్ర వేసింది. కొవిషీల్డ్‌తోపాటు చైనాకు చెందిన సినోవాక్‌ టీకాను కూడా అధికారికంగా గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపిందిద. ఈ మేరకు అస్ట్రేలియా దేశానికి చెందిన ఔషధ నియంత్రణ మండలి ‘థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్’ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని స్కాట్ మోరిసన్ శుక్రవారం వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఈ రెండు టీకాలు పొందినవారు కూడా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం కానుంది. దీంతోపాటు నవంబరు నుంచి స్థానికులు, శాశ్వత నివాసితులకు అంతర్జాతీయ రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు మోరిసన్‌ ప్రకటించారు. అయితే, వ్యాక్సినేషన్‌ పూర్తయిన వారు.. తిరిగొచ్చాక వారంపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఇంకా టీకా వేయించుకోనివారికి గుర్తింపు ఉన్న హోటల్‌లో 14 రోజులపాటు క్వారంటైన్‌ తప్పదని అస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న సమయంలో పకడ్బందీ చర్యలతో కట్టడి చేసింది అస్ట్రేలియా. తాజాగా వైరస్ తగ్గుముఖం పడుతుండటంతో పూర్వ స్థితిని తీసుకువచ్చేందుకు ఆ దేశ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే విదేశీ ప్రయాణికులు రాకపోకలపై ఆంక్షలు తొలగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కరోనా రాకాసి నుంచి విముక్తి కలిగించేందుకు ఆస్ట్రేలియన్లకు భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోరిసన్‌ వివరించారు. విదేశాలకు వెళ్లాలనుకునే ఆస్ట్రేలియన్లకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రం ఇస్తామని, ఇది అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకూ తగినట్లు ఉంటుందని వివరించారు. కరోనా కట్టడికి ఆస్ట్రేలియా మొదటినుంచి కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్‌లు విధిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వీటిని నిరసిస్తూ ప్రజలు ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ 80 శాతానికి చేరుకున్న నేపథ్యంలో క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. దేశ ఆదాయ వనరుల్లో ‘అంతర్జాతీయ విద్య’ కీలమైనది కావడంతో.. విద్యార్థులను తిరిగి రప్పించే పనిలో పడింది.

Read Also….  Anupama Parameswaran : బికినీ ఫోటో అడిగిన నెటిజన్.. అనుపమ సమాధానం వింటే షాక్ అవుతారు.. ఇచ్చిపడేసిందిగా..