Soujanya Suicide: ఆ నటి సూసైడ్ వెనుక రీజనేంటి.. సంచలనంగా మారిన సౌజన్య మృతి
రంగుల ప్రపంచంలో లైఫ్.. ఒక్క సారి ఛాన్స్ వచ్చి తమను తాము నిరూపించుకుంటే చాలు. ఫుల్ లగ్జరీ లైఫ్.. రాజభోగాలు ఉంటాయి. అయినా ఎక్కడో తేడా కొడుతోంది. తెర వెనక ఏం జరుగుతుందో తెలీదు గానీ..
రంగుల ప్రపంచంలో లైఫ్.. ఒక్క సారి ఛాన్స్ వచ్చి తమను తాము నిరూపించుకుంటే చాలు. ఫుల్ లగ్జరీ లైఫ్.. రాజభోగాలు ఉంటాయి. అయినా ఎక్కడో తేడా కొడుతోంది. తెర వెనక ఏం జరుగుతుందో తెలీదు గానీ.. జూనియర్ ఆర్టిస్టుల రియల్ వ్యథలు మాత్రం రీల్ మీదకు ఎక్కుతున్నాయి. రీల్ మీద పాత్రల్లో కనిపించాల్సిన ఆర్టిస్టులు.. రియల్ లైఫ్‌లో విగతజీవులుగా మారుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది. రంగుల జీవితంలో స్క్రీన్ మీద కనిపించే నవ్వులు.. తెర వెనుక ఉండటం లేదా? నటీనటుల వరుస ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి.
నటి సౌజన్య ఆత్మహత్య కన్నడ సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసింది. ఆమె రాసినట్లుగా ఉన్న సూసైడ్‌నోట్ ప్రకారం.. ఆమె ఆరోగ్యం క్షీణించడం, పరిశ్రమలో అవకాశాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. కానీ అసలైన కారణాలు వేరే ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బెంగళూరు శివార్లలోని కుంబల్గోడు ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌లో సౌజన్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఫ్లాట్‌లో నాలుగు భాషల్లో రాసిన సూసైడ్ లెటర్ లభించింది. తల్లిదండ్రులను క్షమించాలని సూసైడ్ లెటర్ రాసింది సౌజన్య. నా మానసిక స్థితి బాగోలేదు.. నన్ను నేను కోల్పోయాను.. త్వరలో ఇంటికి వద్దాం అనుకున్నా.. కానీ ఇలా వస్తానని అనుకోలేదంటూ లెటర్‌లో రాసి ఉంది. ఈ నెల 27న ఈ లెటర్ రాసినట్టు పోలీసులు గుర్తించారు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
25 ఏళ్ల సౌజన్య.. కన్నడ టీవీ సీరియల్స్‌లో చాలా పాపులర్. 2 సినిమాల్లో కూడా ఆమె నటించారు. కొడగు ఆమె స్వస్థలం అయినప్పటికీ.. బెంగుళూరులో ఒంటరిగా ఉంటోంది. అనారోగ్యంతో పాటు టీవీ ఇండస్ట్రీలో రాజకీయాల కారణంగానే సౌజన్య ఆత్మహత్య చేసుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. మూడు పేజీల సూసైడ్ లెటర్‌లో చాలా విషయాలు రాశారు సౌజన్య. అయితే ఈ సూసైడ్ లెటర్ మూడు తేదీల్లో రాయడం సంచలనం రేపుతోంది. మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకోవాలని సౌజన్య నిర్ణయించుకున్నట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కరోనా కారణంగా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడం.. ఒంటరిగా ఉండటంతో మానసిక ఒత్తిడికి లోనైనట్టు చెప్తున్నారు స్థానికులు. అపార్ట్‌మెంట్‌లోనూ ఎవరితోనూ మాట్లాడేది కాదని అంటున్నారు. ఇటు తెలుగు ఇండస్ట్రీలో అనురాధ ఆత్మహత్య చేసుకోవడం కూడా సంచలనంగా మారింది. గతంలోనూ ఎందరో పేరుమోసిన నటీనటులు ఆత్మహత్యలు పలు అనుమానాలకు తావిస్తోంది.
ఉదయ్ కిరణ్.. లవర్‌బాయ్‌గా ఓ వెలుగు వెలిగి ఎలా అర్థంతరంగా చనిపోయాడో.. ఇంకా మన కళ్ల ముదు కదలాడుతూనే ఉందా సిట్చువేషన్.. ఇక ప్రత్యూష మరణం ఇప్పటికీ వీడని మిస్టరీనే. 2003లో తన ప్రియుడు సిద్ధార్ధ్‌రెడ్డితో కలిసి సూసైడ్ చేసుకున్నారామె. ప్రత్యూషను అత్యాచారం చేసి చంపారని అప్పట్లో పెద్ద దుమారమే రేగింది..
2020లో.. మనసు మమత, మౌనరాగం సీరియల్స్ ఫేమ్ శ్రావణి, జూలై 9న కన్నడ నటుడు సుశీల్ గౌడ్, అదే ఏడాది జనవరి 25న. కన్నడ నటి జయశ్రీ రామయ్య డిప్రెషన్‌తో చనిపోయారు.. పాతతరం నటీమణులు దివ్యభారతి మేడమీద నుంచి పడి చనిపోగా.. సిల్క్‌స్మిత ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకుంది. వీళ్లే కాదు.. చాలామంది యువనటులు.. లైఫ్‌ను లీడ్‌చేయలేక తమను తామే చంపుకుంటున్నారు.
మన టాలీవుడ్‌లోనే కాదు.. శాండిల్‌వుడ్‌లోనూ నటుల ఆత్మహత్యలు ఈమధ్యకాలంలో మనల్ని బాధపెట్టాయ్.. మరికొన్ని కదలించాయి.. ఇంకొన్ని కన్నీటిలో ముంచాయి.
ఇవి కూడా చదవండి: SBI Car Loan: కారు కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. జీరో ప్రాసెసింగ్ ఛార్జ్.. ఇంట్లో కూర్చుని తీసుకోండి..
TS RTC: సాహో సజ్జనార్.. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు..