TS RTC: సాహో సజ్జనార్.. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు..

Telangana RTC Employees Salaries: కొత్త బాస్ వచ్చారు.. మార్పులు తెచ్చారు.. ఉద్యోగుల సమస్యలకు చెక్ పెట్టారు.. అవును మీరు చదవుతున్నది నిజమే..  ఆర్టీసీ ఉద్యోగులకు దాదాపు మూడేళ్ల తర్వాత ఒకటో తేదీనే జీతాలు..

TS RTC: సాహో సజ్జనార్.. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు..
Rtc Md Sajjanar
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 01, 2021 | 7:51 AM

కొత్త బాస్ వచ్చారు.. మార్పులు తెచ్చారు.. ఉద్యోగుల సమస్యలకు చెక్ పెట్టారు.. అవును మీరు చదవుతున్నది నిజమే..  ఆర్టీసీ ఉద్యోగులకు దాదాపు మూడేళ్ల తర్వాత ఒకటో తేదీనే జీతాలు అందుకోనున్నారు. ఇన్నాళ్లు పది, పదిహేను రోజులు ఆలస్యంగా వేతనాలు అందుకున్న ఉద్యోగులకు ఇదో గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రతి నెల సరిగ్గా ఒకటో తేదీనే జీతాలు  చెల్లించేలా టీఎస్‌ఆర్టీసీ కొత్త ఎండీ సజ్జనార్‌ ప్లాన్ సెట్ చేశారు.. ఈ మేరకు అక్టోబర్‌ నుంచి ఒకటిన అంటే సరిగ్గా శుక్రవారమే (ఇవ్వాళే) తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు క్రెడిట్ కానున్నాయి. అయితే వాస్తవానికి 2018 డిసెంబర్‌ వరకు ఆర్టీసీ ఉద్యోగులు/కార్మికులు ప్రతినెలా ఒకటో తేదీకి అటూఇటుగా వేతనాలు తీసుకునేవారు. కానీ రాను.. రాను మరింత దారుణంగా మారిందని ఆ సంస్థ ఉద్యోగులు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి సమస్యలకు తోడు కోవిడ్ వ్యాప్తి, లాక్‌డౌన్ సమస్యలు వచ్చ పడటంతో సంస్థకు ఆర్ధిక భారం మరింత పెరిగిపోయింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్, బస్‌భవన్‌ ఉద్యోగులకైతే మరింత దారుణంగా సెప్టెంబర్‌లో 20వ తేదీన వేతనాలు అందినట్లుగా ఆ సంస్థ ఉద్యోగులు ప్రయాణికులతో గోడును చెప్పకున్న ఘటనలు చాలా ఉన్నాయి. ఉద్యోగుల ఈఎంఐలు, ఇతర ఖర్చుల కోసం ప్రతి నెల ఇబ్బందులను మోస్తూ వస్తున్నారు. సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ విషయంపై ఆయన మొదట దృష్టిపెట్టారు.

ఈ సమస్యలపై బ్యాంకులతో చర్చలు జరిపారు. ప్రతినెలా ఒకటో తేదీలోపు రూ.100 కోట్ల ఓవర్‌డ్రాఫ్టు ఇవ్వాలని.. డిపోల్లో రోజువారీ టికెట్‌ కలెక్షన్‌ ఖాతాలను సదరు బ్యాంకులో తెరుస్తామని ప్రతిపాదించారు. దీనికి ఓ ప్రభుత్వరంగ బ్యాంకు ఓ చెప్పింది. అక్టోబర్‌ ఒకటిన జీతాల చెల్లింపు కోసం రూ.100 కోట్లు అందించింది. రోజువారి టికెట్ల ఆదాయం నుంచి కానీ.. ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం నుంచికానీ తిరిగి ఈ సొమ్మును బ్యాంకుకు చెల్లించేలా ప్లాన్ చేశారు.

ఇలాంటి చిక్కు సమస్యల్లో చిక్కుకున్న ఆ సంస్థకు కొత్త దారిని చూపించే పనిలో పడ్డారు ఎండీ సజ్జనార్. ఏ సంస్థకైనా ఉద్యోగులు బలం.. వారిని సరిగ్గా చూసుకుంటేనే సంస్థ అభివృద్ధి.. ఇదే కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్నారు ఆయన. వారు తీసుకునే నెలసరి జీతంను సకాలంలో అందించాలనే లక్ష్యంతో సంస్థలో తొలి అడుగు వేశారు కొత్త బాస్.

ఇవి కూడా చదవండి:  SBI Car Loan: కారు కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. జీరో ప్రాసెసింగ్ ఛార్జ్.. ఇంట్లో కూర్చుని తీసుకోండి..