Huzurabad: హుజురాబాద్ అభ్యర్థికి బీ ఫారంతోపాటు, ఎన్నికల ఖర్చుకు టీఆర్ఎస్ పార్టీ ఎంతిచ్చిందో తెలుసా..?
హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు పార్టీ బీ ఫారం అందచేశారు టీఆర్ఎస్ అధినేత..
Huzurabad By Election – TRS: హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు పార్టీ బీ ఫారం అందచేశారు టీఆర్ఎస్ అధినేత.. సీఎం కేసీఆర్. ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ ఫండ్‌గా 28 లక్షల రూపాయల చెక్కును అభ్యర్థి గెల్లుకి కేసీఆర్ ఇచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు మంత్రి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులున్నారు. ఇక, హుజురాబాద్ లో నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్. గెల్లు నామినేషన్ ప్రక్రియలో మంత్రులు హరీష్ రావు, గంగుల, కొప్పుల పాల్గొనబోతున్నారు.
కాగా, తెలంగాణలోని హుజురాబాద్ ఉప ఎన్నికతోపాటు ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30 వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ వెల్లడించింది. ఇందుకోసం ఇవాళ (అక్టోబర్ 1)న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా నామినాషన్ దాఖలుకు అక్టోబర్ 8వ తేదీ తుదిగడువు. నామినేషన్ల ఉప సంవసంహరణకు అక్టోబర్ 13 చివరి తేదీ. ఇక ఎన్నికలు అక్టోబర్ 30న నిర్వహించనుండగా.. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి.
హుజురాబాద్‌తో పాటు ఏపీ లోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి కూడా అక్టోబర్ 30న ఉప ఎన్నిక జరగనుంది. ఇక దేశ వ్యాప్తంగా మరో 28 అసెంబ్లీ, 3 లోక్‌సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు కూడా ఈసీ ఇదే షెడ్యూల్ విడుదల చేసింది. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12న రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇలాఉండగా, తెలంగాణ ప్రజలతోపాటు, ఆంధ్రప్రదేశ్ జనం కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజురాబాద్ ఉపఎన్నికకు షెడ్యూల్ రానే వచ్చింది. అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే హుజురాబాద్‌లో తమ అభ్యర్థిని ప్రకటించి జోరుగా ప్రచారం చేస్తోంది. ఇటు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. అక్కడ గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పరిస్థతి ఏంటీ?.. ఆ పార్టీ అభ్యర్థి ఎవరు?.. హుజురాబాద్ ఉప ఎన్నికపై హస్తం పార్టీ వైఖరి ఏమిటో తెలియడం లేదు.
కాంగ్రెస్ పార్టీ ఇంతరవరకు హుజురాబాద్ అభ్యర్థినే ప్రకటించలేదు. ఆ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది జోరుగా చర్చ నడుసోంది. డిసెంబర్ లేదా జనవరిలో షెడ్యూల్ వస్తుందని టీ కాంగ్రెస్ పెద్దలు భావించినప్పటికీ.. ముందే షెడ్యూల్ రావటంతో అభ్యర్థి ఖరారుపై నేతలు ఫోకస్ పెట్టారు. ఒకటి రెండు సార్లు అభ్యర్థి ఎంపిక కోసం చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. అయితే హుజురాబాద్‌లో పోటీ చేయడానికి 19 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అభ్యర్థి ఎంపిక కోసం మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో కమిటీ వేశారు. ఈ కమిటీ ముగ్గురు పేర్లను సూచిస్తూ పీసీసీ, ఏఐసీసీకి నివేదిక అందజేసింది. మాజీ మంత్రి కొండా సురేఖ, సదానందం, పత్తి కృష్ణా రెడ్డి పేర్లను నివేదికలో పొందుపర్చింది. మొదట్లో కొండా సురేఖకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ స్థానిక నేతలు వ్యతిరేకించడంతో కొండా సురేఖ పేరును పీసీసీ నేతలు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. లోకల్ లీడర్లు కొండ సురేఖను వ్యతిరేకించడంతో అభ్యర్థి ఎంపిక కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహతో పీసీసీ మరో కమిటీ వేసింది. Read also: China’s Power Crisis: చైనాని చీకటి చేస్తోన్న విద్యుత్ సంక్షోభం.. ట్రాఫిక్ లైట్లు కూడా వెలగడం లేని స్థితి