Student Death: పేరెంట్స్‌ అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తోన్న చదువులమ్మ ఒడిలో జరిగిన దారుణం

యస్‌.. బడిలో డెత్‌ గేమ్‌ దడ పుట్టిస్తోంది. అభం శుభం తెలియని చిన్నారుల్లో పంతాలు, పట్టింపులా? తాము చెప్పిందే రైట్.. తాము చేసేదే ఫైనల్‌

Student Death: పేరెంట్స్‌ అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తోన్న చదువులమ్మ ఒడిలో జరిగిన దారుణం
Visakha Student
Follow us

|

Updated on: Oct 01, 2021 | 2:13 PM

Visakhapatnam Student Death: యస్‌.. బడిలో డెత్‌ గేమ్‌ దడ పుట్టిస్తోంది. అభం శుభం తెలియని చిన్నారుల్లో పంతాలు, పట్టింపులా? తాము చెప్పిందే రైట్.. తాము చేసేదే ఫైనల్‌ అనే మెంటాల్టీ పెరిగిపోతుందా ? ఈ తరహా క్రమశిక్షణ కరోనా కారణంగా పోయిందా? స్కూళ్లు లేక వాళ్లలో సైకాలజీ పిచ్చిపిచ్చిగా మారిపోయిందా? విశాఖలో విద్యార్థుల కొట్లాట ఒకర్ని పొట్టనబెట్టుకోవడం కన్నవాళ్లను కంగారెత్తిస్తోంది. ఎవరు గొప్ప? ఈ ఒకే ఒక్క పదం స్టూడెంట్‌ను పొట్టనబెట్టుకుంది. చిన్న గొడవ.. సర్దుకుంటే సద్దుమణిగేదే. కానీ రచ్చ క్రియేట్‌ అయింది. విద్యార్థుల మధ్య గొడవకు దారితీసింది.

విశాఖలోని ఓ ఎయిడెడ్‌ పాఠశాలలో సెవెన్త్ క్లాస్ చదువుతున్న జశ్వంత్‌.. మరో స్టూడెంట్‌ మధ్య గొడవ జరిగింది. ఎవరు గొప్ప అన్న విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్త చినికి చినికి గాలివానగా మారింది. చివరకు కొట్లాటకు దారి తీసింది. ఛాతిపై బలంగా దెబ్బతగలడంతో స్పాట్‌లోనే కుప్పకూలిపోయాడు.

గుండెలవిసేలా రోధిస్తున్న వీళ్లంతా జశ్వంత్ కుటుంబసభ్యులు. రోజులాగే తమ బిడ్డను స్కూల్‌కి పంపించారు. సాయంత్రం తిరిగి ఇంటికి వస్తారనుకున్నారు. కానీ శవమై కనిపించే సరికి తట్టుకోలేకపోయారు. తమ బిడ్డ ఇక తిరిగి రాడనే నిజాన్ని జీర్ణించుకోలేక గుండెలు బాదుకున్నారు. దారుణం జరిగిపోయింది. కానీ పిల్లలు ఇలా ఎందుకు మారారు? టీచర్లు కూడా దీనిపై ఖిన్నులవుతున్నారు. ఇక డాక్టర్లు మాత్రం పిల్లల్లో మెచ్యూరిటీ లేని కారణంగానే ఇలాంటి దారుణాలు జరిగాయన్నాయని చెబుతున్నారు. అలాగే డిజిటల్ ప్రభావం కూడా ఉండొచ్చంటున్నారు.

అసలే పసివాళ్లు. సున్నితమైన శరీరాలు, మనస్తత్వాలు. సినిమాలు, సెల్‌ఫోన్‌ల ప్రభావంతో చాలా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కొట్లాటలతో జరిగే ప్రమాదాన్ని మాత్రం వాళ్లు ఊహించలేకపోతున్నారు. ఆవేశంలో పంతాలు పట్టింపులతో జరగరాని ఘోరం జరిగిపోతుంది. చదువులమ్మ ఒడిలో జరిగిన ఈ దారుణం పేరెంట్స్‌ అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. గొడవల కారణంగా విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కంటతడి పెట్టించింది. అయితే పిల్లలు ఏం చేస్తున్నారు.. వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందో పేరెంట్స్ ఓ కంట కనిపెట్టాలని సైకాలజిస్ట్‌లు సజెస్ట్‌ చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా కౌన్సిలింగ్‌ ఇవ్వాలంటున్నారు.

Read also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను కలిసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు