Vizag: ‘ఎవరు గొప్ప’ అంటూ ఇద్దరు సెవెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఫైట్.. ఒకరు మృతి
విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో విషాదం నెలకుంది. విద్యార్థుల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసింది. విద్యార్థుల తమ ఎంతో ఫ్రూవ్ చేసుకునే క్రమంలో ఈ దారణం చోటుచేసుకుంది.
విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో విషాదం నెలకుంది. విద్యార్థుల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసింది. ఇటీవల వరంగల్ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘర్షణలో ఓ స్టూడెంట్ మృతి చెందాడు. తాజాగా విశాఖలో మరో సెవెన్త్ క్లాస్ స్టూడెంట్ చనిపోయాడు. ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవతోనే జశ్వంత్ అనే విద్యార్థి మృతి చెందినట్టు నిర్థారించారు పోలీసులు. ఓ ఎయిడెడ్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న జశ్వంత్, మరో స్టూడెంట్ మధ్య స్కూల్‌లోనే గొడవ జరిగింది. ఎవరు గొప్ప అన్న విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ.. చినికి చినికి గాలివానగా మారి కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి దాడిలో కుప్పకూలిపోయాడు జశ్వంత్. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. జశ్వంత్ మృతి చెందాడు. విద్యార్థుల మధ్య గొడవ జరిగిన సమయంలో మరో ఇద్దరు స్టూడెంట్స్ అక్కడే ఉన్నారని..వారి నుంచి అన్ని వివరాలు సేకరిస్తున్నామంటున్నారు పోలీసులు. మరోవైపు టీచర్స్‌ను కూడా ఈ ఘటనపై ఆరా తీస్తున్నామని తెలిపారు. చదువుకోవలసిన వయసులో ఇలా గొడవలతో ప్రాణాలు పోగొట్టుకోవడం బాధాకరమంటున్నారు.
ఏడో తరగతి పిల్లవాడికి ఎంత బలం ఉంటుంది? ఎంత గట్టిగా కొడితే చావు దెబ్బ తగులుతుంది. ! ఈ ప్రశ్నలు వేసుకుంటే నిజమే కదా.. అలా ఎలా చనిపోతారు.. అన్న డౌట్ వస్తుంది. కానీ, బాడీలో కొన్ని సెస్సిటివ్ స్పాట్స్ ఉంటాయి. తగలరాని చోట, తగలరాని విధంగా అక్కడ కిక్ తగిలితే, చిన్నా పెద్ద తేడా ఉండదు. ఎవరైనా ఇట్టే ప్రాణం కోల్పోతారు. విశాఖ స్టూడెంట్ కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాతీపై గట్టిగా తగలడం వల్లనే బాబు చనిపోయాడన్నది పక్కాగా తెలుస్తున్న విషయం.
Also Read: ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ‘తలా’నా మజాకా.. ప్రశంసల జల్లు
సరైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుండానే వాహనాలు నడుపుతున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్