AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరైన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు లేకుండానే వాహనాలు నడుపుతున్నారా…? అయితే మీకో షాకింగ్ న్యూస్

సరైన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు లేకుండానే వాహనాలు నడుపుతున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది.

సరైన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు లేకుండానే వాహనాలు నడుపుతున్నారా...? అయితే మీకో షాకింగ్ న్యూస్
Insurance Claim
Ram Naramaneni
|

Updated on: Oct 01, 2021 | 9:05 AM

Share

సరైన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు లేకుండానే వాహనాలు నడుపుతున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. వాహనానికి సరైన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయింను తిరస్కరించొచ్చని స్పష్టం చేసింది. చోరీ అయిన ఓ కారుకు సంబంధించిన ఇన్సూరెన్స్ వివాదంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ కామెంట్స్ చేసింది. ఆ వాహనానికి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు గడువు తీరి ఉండడంతో ఇన్సూరెన్స్ క్లెయింను తిరస్కరించింది. పాలసీ రూల్స్, షరతుల ప్రాథమిక ఉల్లంఘన జరిగినట్లు తేలితే ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించొచ్చని వెల్లడించింది.  రాజస్థాన్‌కు చెందిన ప్రైవేటు కాంట్రాక్టర్‌ సుశీల్‌ కుమార్‌ గోడారా తన బొలెరో వెహికల్‌కి పంజాబ్‌లో యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ సంస్థ నుంచి రూ.6.17 లక్షలకు బీమా పాలసీ తీసుకున్నాడు. ఆ వాహనానికి ఉన్న తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ గడువు 2011 జులై 19న ఎండ్ అయింది. అదే నెల 28న అతడి కారు జోధ్‌పుర్‌లో మిస్ అయ్యింది. అక్కడి పోలీస్‌ స్టేషన్‌లో అతడు కేసు పెట్టాడు. కారు ఆచూకీ తెలియలేదంటూ పోలీసులు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేశారు. ఇన్సూరెన్స్‌ మొత్తం కోసం సుశీల్‌ కుమార్‌ క్లెయిం చేసుకోగా రిజిస్ట్రేషన్‌ లేనందున చెల్లించలేమంటూ యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ సంస్థ తిరస్కరించింది.

సుశీల్‌ రాజస్థాన్‌లోని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార మండలిని ఆశ్రయించగా అతనికి బీమా మొత్తం చెల్లించాల్సిందేనంటూ తీర్పు వచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ బీమా సంస్థ జాతీయ మండలిలో రివ్యూ పిటిషన్‌ వేసింది. అక్కడా సేమ్ సీన్ రిపీటయ్యింది. దీనిపై ఆ సంస్థ సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. కారు చోరీ జరిగిన రోజు సరైన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు లేకుండానే వినియోగించారు కాబట్టి.. మోటార్‌ వాహనాల యాక్ట్‌లోని రూల్స్ అతిక్రమించారని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఇన్సూరెన్స్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొంది. ఈ సందర్భంలో బీమా క్లెయింను తిరస్కరించడానికి ఇన్సూరెన్స్‌ సంస్థకు హక్కు ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.

Also Read: ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ‘తలా’నా మజాకా.. ప్రశంసల జల్లు

లోన్ యాప్స్ కేసులో కదులుతోన్న కూసాలు.. ఏకంగా 131 కోట్ల రూపాయలు సీజ్

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్