Electric scooters: కేవలం రూ.45 వేలకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!

Electric scooters: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కస్టమర్లు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను..

Electric scooters: కేవలం రూ.45 వేలకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!
Electric scooters
Follow us

| Edited By: Phani CH

Updated on: Oct 01, 2021 | 8:56 AM

Electric scooters: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కస్టమర్లు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కొన్ని ఈవీ వాహనాలు విడుదల కాగా, మరికొన్ని వాహనాలు విడుదల అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక దేశంలో అత్యంత తక్కువకు లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ తమదే అని కోమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రకటించింది. గత ఏడాది జూన్ నెలలో విడుదల చేసిన కోమాకి ఎక్స్ జీటీ-ఎక్స్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రెండు మోడళ్లలో విడుదల చేసినట్లు వెల్లడించింది. జెల్ బ్యాటరీ మోడల్ ధర రూ. 45 వేల కంటే తక్కువ. లిథియం అయాన్ బ్యాటరీ మోడల్ రూ. 60వేల ధరకు లభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే కోమాకి ఎక్స్ జీటీ-ఎక్స్1 చాలా తక్కువ ధరకే లభిస్తున్నట్లు కోమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రకటించింది. ఇప్పటి వరకు కోమాకి ఎక్స్ జిటి-ఎక్స్1 స్కూటర్లను రూ. 25 వేల వరకు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది.

120 కిలోమీటర్ల వరకు ప్రయాణం..

ఈ-స్కూటర్ ఎకో మోడ్‌లో120 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నట్లు తెలిపింది. ఇందులో సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్, సైజ్ అప్ బీఐఎస్ వీల్స్ ఉన్నట్లు పేర్కొంది. కొమాకి ఎక్స్ జీటీ-ఎక్స్1లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్, భారీ బూట్, స్మార్ట్ డ్యాష్, రిమోట్ సెన్సార్లు, రిమోట్ లాక్ ఫీచర్స్ పొందుపర్చారు. కోమాకి తన లిథియం అయాన్ బ్యాటరీ స్కూటర్లకు 2+1(1 సంవత్సరం సర్వీస్ వారెంటీ) సంవత్సరాలు, లీడ్ యాసిడ్ బ్యాటరీ స్కూటర్లకు 1 సంవత్సరం వారెంటీ అందిస్తోంది. పెట్రోల్ ధరలు, కాలుష్యం మారుతున్న నేపథ్యంలో మార్పు అనేది జరుగుతుందని, ప్రజలు మార్పును స్వీకరించడం ప్రారంభించారు. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటంతో రోడ్లపై మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను వస్తాయని కోమాకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

Cyclone Tracker: మీ స్మార్ట్‌ఫోన్‌లో తుఫాన్లను ఎలా ట్రాక్‌ చేయాలో తెలుసా..? పూర్తి వివరాలు..!

ATM Cash: ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదా? ఇక నుంచి అలాంటిదేమి ఉండదు.. ఆర్బీఐ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ 1 నుంచి అమలు

సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
నీరు రివర్స్‌లో ప్రవహించడం మీరు ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే
నీరు రివర్స్‌లో ప్రవహించడం మీరు ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే