AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Cash: ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదా? ఇక నుంచి అలాంటిదేమి ఉండదు.. ఆర్బీఐ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ 1 నుంచి అమలు

ATM Cash: బ్యాంకింగ్‌ రంగంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అనేక మార్పులను తీసుకువస్తోంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు..

ATM Cash: ఏటీఎంలలో డబ్బులు ఉండటం లేదా? ఇక నుంచి అలాంటిదేమి ఉండదు.. ఆర్బీఐ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ 1 నుంచి అమలు
Subhash Goud
| Edited By: |

Updated on: Sep 30, 2021 | 8:30 AM

Share

ATM Cash: బ్యాంకింగ్‌ రంగంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అనేక మార్పులను తీసుకువస్తోంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకు కస్టమర్లకు తీపి కబురు అందించింది. ఊరట కలిగించే ప్రతిపాదన అందుబాటులోకి తీసుకువస్తోంది. బ్యాంకులకు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు జరిమానాల విధింపు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం కలుగనుంది. ఏటీఎంలలో డబ్బులు లేకపోతే జరిమానా విధించనుంది ఆర్బీఐ.

ఏటీఎంలలో క్యాష్‌లేకపోతే బాదుడు..

ఏటీఎంలలో డబ్బులు లేకపోతే బ్యాంకులకు, వైట్‌ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు భారీ మొత్తంలో చార్జీలు విధించనుంది ఆర్బీఐ. నెలలో 10 గంటలకు మించి ఏటీఎంలో క్యాష్ లేకపోతే అప్పుడు చార్జీల విధింపు ఉంటుంది. ఆర్బీఐ విధించే ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

ఏటీఎంలలో ఎప్పుడూ క్యాష్‌ ఉండేలా..

కాగా, ఈ మధ్య కాలంలో చాలా ఏటీఎంలలో సరైన క్యాష్‌ ఉండటం లేదు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. కస్టమర్లు ఏటీఎం సెంటర్లకు వచ్చి డెబిట్‌ కార్డు పెట్టి పిన్‌ ఎంటర్‌ చేసిన తర్వాత క్యాష్‌ లేదని చూపిస్తుంది. దీంతో సమయం వృధా కావడమే కాకుండా వినియోగదారులు నిరాశ చెందుతున్నారు. ఇలా ఏటీఎంలలో క్యాష్‌లేకపోవడంతో కస్టమర్ల నుంచి అనేక ఫిర్యాదులు అందుకుంది ఆర్బీఐ. ఇలాంటి పరిస్థితులు లేకుండా చూసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలలో ఎప్పుడూ క్యాష్ అందుబాటులో ఉండేలా ఈ కొత్త నిబంధనలు తీసుకువస్తోంది.

ఒక్కో ఏటీఎంకు రూ.10 వేల జరిమానా..

ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం.. ఏటీఎంలలో డబ్బులు లేకపోతే బ్యాంకులకు, వైట్‌ లేబుల్‌ ఆపరేటర్లకు జరిమానా పడనుంది. ఒక్కో ఏటీఎంకు రూ.10 వేల చొప్పున జరిమానా విధించనున్నట్లు తెలుస్తోంది. ఆర్‌బీఐ జరిమానా విధింపు నిబంధనల నేపథ్యంలో బ్యాంకులు వాటి వాటి ఏటీఎంలలో ఎప్పుడు క్యాష్ అందుబాటులో ఉండేలా చూసుకోనున్నాయి.

కాగా, ఇలా ఎన్నో ఏటీఎంలలో సరైన డబ్బులు ఉండటం లేదు. అత్యవసరంగా వారు ఏటీఎంలకు వచ్చి కార్డు పెట్టే వరకు కూడా తెలియడం లేదు ఏటీఎంలో క్యాష్‌ లేదని. కొన్ని ఏటీఎంలలో క్యాష్‌ లేదని ముందుగానే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా డబ్బుల కోసం దూరంగా ఉన్న ఏటీఎంల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దీని వల్ల సమయం వృథా కావడం, తర్వాత ఏటీఎంలలో డబ్బులు లేక ఇబ్బందులు పడటం జరుగుతోంది. వినియోగదారులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్బీఐ ఆ నిర్ణయం తీసుకుంది.

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై