Cyclone Tracker: మీ స్మార్ట్‌ఫోన్‌లో తుఫాన్లను ఎలా ట్రాక్‌ చేయాలో తెలుసా..? పూర్తి వివరాలు..!

Cyclone Tracker: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను గులాబ్‌ తుఫాను వణికిస్తోంది. భారీ వర్షాలతో ముంచెత్తుతోంది. ఈ తుఫాను కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి...

Cyclone Tracker: మీ స్మార్ట్‌ఫోన్‌లో తుఫాన్లను ఎలా ట్రాక్‌ చేయాలో తెలుసా..? పూర్తి వివరాలు..!
Follow us

|

Updated on: Sep 28, 2021 | 5:47 AM

Cyclone Tracker: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను గులాబ్‌ తుఫాను వణికిస్తోంది. భారీ వర్షాలతో ముంచెత్తుతోంది. ఈ తుఫాను కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ గులాబ్‌ దెబ్బకు ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గులాబ్‌ తుఫాను ఒక్కటే కాదు.. పలు తుఫాన్లు కూడా వస్తూనే ఉన్నాయి. తుఫాను పరిస్థితు ఎలా ఉంటుందనే విషయం టీవీల ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకుంటాము.  భారత వాతావరణ శాఖ రాబోయే తుపాన్లపై ఎప్పటికప్పుడు హెచ్చరికలను జారీ చేస్తాయి. తుఫాను బలపడిందా, లేదా బలహీన పడిందా అనే విషయాలను అందుబాటులో ఉన్న వెబ్‌సైట్లను ఉపయోగించి మన స్మార్ట్‌ఫోన్‌తో మనమే ట్రాక్‌ చేయవచ్చు. ఈ విషయం అందరికి తెలియకపోవచ్చు. అందుబాటులోని వెబ్‌సైట్ల ద్వారా తుఫాను కదలికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో తుఫాను ప్రభావం నుంచి కాస్త ఉపశమన చర్యలను ముందుగా తీసుకునే అవకాశం ఉంటుంది.

తుఫాను కదలికలను ఆన్‌లైన్‌లో ఎలా ట్రాక్‌ చేయాలి..?

www.mausam.imd.gov.in

తుఫానును ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసే వెబ్‌సైట్లలో mausam.imd.gov.in అత్యంత విశ్వసనీయమైన వెబ్‌సైట్‌లలో ఇది ఒకటి. ఈ వెబ్‌సైట్‌ను ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. దేశంలో సంభవించే అన్ని తుఫాన్‌లను ఈ వెబ్‌సైట్‌ ద్వారా ట్రాక్ చేయవచ్చును. మీరు తుఫాన్‌ను ట్రాక్‌ చేయలనుకుంటే బ్రౌజర్‌లో mausam.imd.gov.in ఎంటర్‌ చేయండి. తరువాత వెబ్‌సైట్‌లో సైక్లోన్‌పై క్లిక్‌ చేయండి. తరువాత ట్రాక్ సైక్లోన్ డిస్ట్రబెన్స్‌పై క్లిక్‌ చేయగానే ఈ వెబ్‌సైట్‌ ద్వారా తుపాన్లను ట్రాక్‌ చేయవచ్చును.

www.rsmcnewdelhi.imd.gov.in

ఉత్తర హిందూ మహాసముద్రం ఏర్పడే తుపాన్లను ట్రాక్‌ చేయడానికి ఈ వెబ్‌సైట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వెబ్‌సైట్‌ను భారత వాతావరణశాఖ-ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ అభివృద్ది చేశారు.

www.hurricanezone.net

www.hurricanezone.net వెబ్‌సైట్‌ సహయంతో తుఫాన్లను ట్రాక్‌ చేయవచ్చు. తుఫాన్ల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో ఇండియన్‌ ఓషన్‌, వెస్ట్‌ పసిఫిక్‌, సౌత్‌ పసిఫిక్, సెంట్రల్‌ పసిఫిక్‌, ఈస్ట్‌ పసిఫిక్‌, అట్లాంటిక్‌ ప్రాంతాల్లో వచ్చే తుఫాన్లను, టైఫూన్ల, హరికేన్‌లను ట్రాక్‌ చేయవచ్చును. ‌

ఉమాంగ్‌ యాప్‌(UMANG)

ఉమాంగ్‌ యాప్‌ను ఉపయోగించి ప్రత్యక్షంగా తుఫాన్ల గురించి ట్రాక్‌ చేయవచ్చును. ఈ యాప్‌ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఉమాంగ్‌ యాప్‌ సహాయంతో తుఫాన్ల రియల్‌టైమ్‌ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందిస్తోంది. ఇలా మీ స్మార్ట్‌ఫోన్‌లోనే తుఫాన్లను ట్రాక్‌ చేయవచ్చు. తుఫాన్‌ స్థితిగతులను తెలుసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Visakha Airport: విశాఖ ఎయిర్‌పోర్ట్‌‌కు పొంచి ఉన్న ముంపు.. గంట గంటకు పెరుగుతున్న ప్రవాహం.. నీటమునిగిన రన్‌వే..

Cyclone Gulab Live: దూసుకొస్తున్న గులాబ్‌.. భారీ వర్షాలు… ఆ జిల్లాల్లో హై అలర్ట్.