Mega Comet: దూసుకువస్తోన్న భారీ తోకచుక్క.. భూమిని ఢీకొట్టనుందా..? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

Mega Comet: హేలీ తోక చుక్క పేరు విన్నారా? మీరు కనుక 1980 తర్వాత పుట్టి ఉన్నవాళ్లు అయితే వినే ఉంటారు. ప్రస్తుతం శాస్త్రవేత్తులు చెబుతుంటే వింటుంటాం..

Mega Comet: దూసుకువస్తోన్న భారీ తోకచుక్క.. భూమిని ఢీకొట్టనుందా..? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
Mega Comet
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Sep 28, 2021 | 8:25 AM

Mega Comet: హేలీ తోక చుక్క పేరు విన్నారా? మీరు కనుక 1980 తర్వాత పుట్టి ఉన్నవాళ్లు అయితే వినే ఉంటారు. ప్రస్తుతం శాస్త్రవేత్తులు చెబుతుంటే వింటుంటాం. ఆకాశంలో తెల్లటి పాయలా మెరిసే ఈ తోక చుక్క అవశేషాలు ఇప్పటికీ మన భూ వాతావరణంలో తిరుగుతున్నాయి. ప్రతి ఏడాదిలో రెండు సార్లు ఈ తోక చుక్క అవశేషాలు కనిపిస్తాయి. ఈ వారమంతా భూమంతా సౌరశక్తి గురుత్వాకర్షణ శక్తికి హేలీ తోక చుక్క నుంచి రాలిపోయిన దుమ్ముతో నిండిపోతుంది. ఈ తోకచుక్క 1682లో కనిపించిన తోకచుక్కను ఖగోళ శాస్త్రవేత్తలు హేలీగా పేర్కొన్నారు. ఇది ప్రతి 75-76 ఏళ్లకొక సారి కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తోకచుక్క 1986లో కన్పించగా.. తర్వాత 2061లో కన్పించనుంది. హేలీ తోక చుక్క కంటే భారీ తోక చుక్కను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మన సౌర కుటుంబంకు దగ్గరగా వస్తోన్న​ భారీ తోకచుక్కగా ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ తోకచుక్కను మొదట పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పెడ్రో బెర్నార్డినెల్లి, గ్యారీ బెర్న్‌స్టెయిన్ కనుగొన్నారు. ఈ భారీ తోకచుక్కకు C/2014 UN271 అనే నామకరణం చేశారు. ఈ తోకచుక్క పరిమాణంలో అత్యంత భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిమాణంలో మార్స్‌ మూన్‌ పోబోస్‌, డిమోస్‌ కంటే పెద్గగా ఈ కామెట్‌ ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. శాస్త్రవేత్తలు గుర్తించిన తోకచుక్కల్లో అతిపెద్ద తోకచుక్క ఇది.

సెర్రో టోలోలో ఇంటర్-అమెరికన్ అబ్జర్వేటరీలో కొనసాగుతున్న డార్క్ ఎనర్జీ సర్వే (డీఈఎస్‌) ద్వారా ఈ మెగా కామెట్ డేటాను పరీశిలిస్తున్నారు. ముందుగా ఈ తోక చుక్కను ఒక ఆస్ట్రరాయిడ్‌గా గుర్తించగా, అది తోకచుక్క అని శాస్త్రవేత్తలు నిర్థారించారు. కామెట్ బెర్నార్డినెల్లి-బెర్న్‌స్టెయిన్ మెగా కామెట్ పరిమాణం ముందుగా 200 కిలోమీటర్ల వెడల్పు ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

తోకచుక్క భూమిని ఢీకొనుందా..?

ఈ తోకచుక్క మన సౌర వ్యవస్థ గుండా ప్రయాణిస్తుంది. 2031 సంవత్సరంలో మన సూర్యుడికి, భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ తోకచుక్క అత్యంత పెద్దదిగా ఉన్నప్పటికీ, శాస్త్రవేత్తలు ఈ తోకచుక్క గమనాన్ని ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం.. భూమికి ఈ తోకచుక్క నుంచి ఎటువంటి ముప్పు లేదని స్పష్టం చేస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Mars Quakes: 90 నిమిషాల పాటు మార్స్‌పై భారీ ప్రకంపనలు.. కారణం ఇదేనట.. వెల్లడించిన నాసా..!

Diabetes: పెళ్లికి ముందు డయాబెటిస్‌ ఉందా..? తర్వాత ఈ విష‌యాల్లో ఇబ్బందులే..!