Diabetes: పెళ్లికి ముందు డయాబెటిస్‌ ఉందా..? తర్వాత ఈ విష‌యాల్లో ఇబ్బందులే..!

Diabetes: ప్రస్తుత కాలంలో డయాబెటిస్‌ బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. వివిధ కారణాల వల్ల డయాబెటిస్‌ బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒకవేళ డయాబెటిస్‌..

Diabetes: పెళ్లికి ముందు డయాబెటిస్‌ ఉందా..? తర్వాత ఈ విష‌యాల్లో ఇబ్బందులే..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 25, 2021 | 5:05 PM

Diabetes: ప్రస్తుత కాలంలో డయాబెటిస్‌ బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. వివిధ కారణాల వల్ల డయాబెటిస్‌ బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒకవేళ డయాబెటిస్‌ దశకు చేరుకొన్నా.. సరైన మందులు వాడుతూ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఒక వేళ వంశపారపర్యంగా, ఇతర కారణాల వల్ల డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఉంటే పెళ్లికి ముందు భయాందోళన చెందుతుంటారు. పెళ్లికి ముందు బయటపడుతుందేమోనన్న భయంతో ఏ మాత్రం అశ్రద్ధ వద్దు వహించవద్దంటున్నారు వైద్య నిపుణులు. ఒకవేళ బయటపడ్డా, దాన్ని దాచాల్సిన అవసరం లేదని, అలాగే, డయాబెటిస్‌ ఉన్నవారిని వివాహం చేసుకొనేందుకు, వారితో కలిసి జీవించేందుకూ భయపడక్కర్లేదు. కాకపోతే వివాహానికి ముందు వైద్యుడి దగ్గర కౌన్సిలింగ్‌ తీసుకొంటే మంచిదంటున్నారు. సాధారణంగా డయాబెటిస్‌ ఉన్నవారి వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలివి. రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటే.. చిన్నాచితకా ఇబ్బందులు కూడా దూరమవుతాయి. ఏ ఇబ్బంది ఉండదు.

షుగర్‌ లెవల్స్‌ ఎక్కువైనప్పుడు నరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఫలితంగా అంగస్తంభన లేకపోవడం, శీఘ్రస్కలనం లాంటి సమస్యలు వస్తాయి. ఒకటిరెండుసార్లు ఇలా జరిగితే తనమీద తనకు నమ్మకం పోయి, మున్ముందు కూడా ఇబ్బంది పడతారు. మహిళల్లో కూడా అధిక చక్కెర వల్ల చర్మం పొడిబారిపోయి కలయిక బాధగా మారవచ్చు.

సంతానం..

మగవారిలో వీర్యకణాల సంఖ్య తక్కువ కావడం, ఉన్నవి కూడా బలహీనపడటం వల్ల సంతానం కష్టమవుతుంది. ఇక మహిళల్లో అధిక చక్కెర, దాంతోపాటు వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల ఫాలోపియన్‌ ట్యూబుల్లో అడ్డంకులు ఏర్పడటం అవకాశం ఉంటుంది. అలాగే రుతుక్రమం సరిగా లేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ గర్భం దాల్చినా అది నిలవలేని ప్రమాదం ఉంటుంది. అందుకే వైద్యులను సంప్రదించడం మంచిది.

భావోద్వేగాలు:

రక్తంలో చక్కెర నిల్వలు మరీ ఎక్కువైనా, మరీ తక్కువైనా అవి రక్తప్రసరణ మీదా.. మెదడుకు, గుండెకు అందించే శక్తి మీదా ప్రభావం చూపుతుంది. ఫలితంగా చిరాకుపరాకులు వస్తాయి. రోజువారీ జీవితంలో వచ్చే ప్రతి చిరాకుకూ షుగర్‌తో ముడిపెట్టడం భావ్యం కాదు కానీ, మన స్పందన అసహజంగా తోస్తే మాత్రం చక్కెర అదుపులో ఉందో లేదో గమనించుకోవాల్సిందే.

నీరు ఎక్కువగా తాగాలి:

నీరు ఎక్కువగా తాగడం వల్ల చక్కెర, ఇతర ప్రిజర్వేటివ్స్ కలిపిన కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండవచ్చు. ఈ పానీయాలు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటి వల్ల టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కూల్‌డ్రింక్స్‌ వల్ల లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఇది 18 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే టైప్1 డయాబెటిస్. నీరు ఎక్కువగా తాగడం వల్ల రెండు రకాల డయాబెటిస్‌లకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇలాంటి వారి రక్తంలో చక్కెర స్థాయులు మరింత స్థిరంగా ఉంటాయని వివిధ అధ్యయనాల్లో తేలింది.

ఆహారం..

ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మీరు సులభంగా టైప్ 2 డయాబెటిస్ నుంచి తప్పించుకోవచ్చు. మీ రక్తంలో చెక్కర శాతాన్ని అది తగ్గిస్తుంది. మెటబాలిక్ రేటును పెంచుతుంది.

స్మోకింగ్..

స్మోకింగ్ చేయడం వల్ల మీ హార్మోన్స్‌పై తీవ్రమైన ప్రభావం కలుగుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ కలిగే అవకాశం ఉంది.

ద్రవ పదార్థాలు..

మాన శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. రక్తప్రసరణ నుంచి కణాల నిర్వహణ వరకు అన్నింటినీ నీరు ప్రభావితం చేయగలదు. మంచినీరు అధికంగా తీసుకోండి.

సరైన నిద్ర:

ప్రతి ఒక్కరు సరైన నిద్ర పోవడం ఎంతో మంచిది. సరైన నిద్ర లేకపోవడం వల్ల అది స్ట్రెస్‌కు కారణం అవుతుంది. అది మీ శరీరంలో చెక్కర శాతాన్ని పెంచుతుంది. ప్రతీ రోజు 7-8 గంటలు నిద్రపోవడం అవసరం.

శారీరక శ్రమ:

సరైన వ్యాయామం లేకుంటే రక్తంలో చెక్కర శాతం పెరుగుతుంది. దీన్ని నివారించడానికి జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి. ప్రతి రోజు వాకింగ్‌ చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. వ్యాయామాల వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్‌ బారిన పడకుండా కాపాడుకోవడానికి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీని వల్ల శరీర కణాలకు ఇన్సులిన్స్‌ సంగ్రహించే శక్తి పెరుగుతుంది. ఇలాంటి కసరత్తులు చేసేవారిలో రక్తంలో చెక్కర స్థాయులను అదుపులో ఉంచడానికి తక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది.

పీచు పదార్థాలు..

ఆహారంలో ఎక్కువ మొత్తంలో పీచుపదార్థాలు (ఫైబర్) ఉండే ఆహారం తీసుకోవడం వల్ల డయాబెటిస్‌కు దూరంగా ఉండవచ్చు. ఫైబర్ ఉండే సమతులాహారాన్ని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. దీంతో సహజంగానే డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకునేవారు బరువు తగ్గుతారు. వారికి గుండె జబ్బులు వంటి ప్రమాదాలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆహారంలో ఫైబర్ వనరులైన అన్నిరకాల పండ్లు, కూరగాయలు, బీన్స్, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి.

బరువు తగ్గాలి:

ఊబకాయులు, బరువు ఎక్కువ ఉన్న వారు డయాబెటిస్‌కు దూరంగా ఉండాలంటే బరువు తగ్గాలి. ఈ ప్రక్రియలో మీరు కోల్పోయే ప్రతీ కిలో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఊబకాయులు కనీసం ఏడు శాతం బరువు తగ్గి, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే, వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం 60 శాతం తగ్గుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది.

1. ఒక వేళ డయాబెటిస్‌ ఉన్న తర్వాత దానిని అదుపులో ఉంచుకోవాలని సరైన ఆహార నియమాలు పాటిస్తే అదుపులో ఉంటుంది. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్ ఆహారాలు తినండి. కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలు మన చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్‌లను ఏయే వస్తువులు కలిగి ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిండి పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

2. తక్కువ ఉప్పు తినండి: ఎక్కువ మొత్తంలో ఉప్పు తినడం వల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. దీని కారణంగా గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఉప్పును తక్కువ తీసుకోవడం బెటర్‌.

3. పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తినండి: ఈ వ్యాధి ఉన్నవారు ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు వంటి వాటికి పోషకాలుగా పనిచేసే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి.

4. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను ఎంచుకోండి: మనందరం మన రోజువారీ దినచర్యలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను చేర్చాలి. ఇది ఎంతో శక్తిని ఇస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులలో విత్తనాలు, ఉప్పు లేని గింజలు, అవోకాడోలు, చేపలు, పొద్దుతిరుగుడు నూనె, ఆలివ్ నూనె ఉన్నాయి.

5. ఆల్కహాల్ తాగడం మానుకోండి: మధుమేహం ఉన్నవారు ఆల్కహాల్ తాగడం మానుకోవాలి. ఇది డయాబెటిక్ రోగులకు హానికరం. ఇది చక్కెర స్థాయిని పెంచుతుంది. దీని వలన ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

6. ఆహారంలో ఖనిజాలు, విటమిన్‌ పదార్థాలు చేర్చండి: ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది. ఈ పదార్థాలు మిమ్మల్ని శారీరకంగా చురుకుగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతాయి.

ఇవీ కూడా చదవండి:

Eye Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టడం ఎలా..? అద్భుతమైన చిట్కాలు..!

Diabetic Eye Disease: మీ కళ్లు మసకబారుతున్నాయా..? ఈ వ్యాధి కావచ్చు చెక్‌ చేసుకోండి..!

Oil Purify Test: చిన్న ప్రయోగంతో మీ వంటింట్లో ఉండే నూనెలో కల్తీ ఉందో..? లేదో..తెలుసుకోండిలా..?

BP, Sugar: బీపీ, షుగర్‌ పెరిగిపోతోందా..? ఏం చేయాలి.. ప్రతి నలుగురిని ఈ రెండు జబ్బులు..!

బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో