Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BP, Sugar: బీపీ, షుగర్‌ పెరిగిపోతోందా..? ఏం చేయాలి.. ప్రతి నలుగురిని ఈ రెండు జబ్బులు..!

BP, Sugar: ప్రస్తుతమున్న కాలంలో జబ్బుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తినే ఆహారం, జీవన విధానంలో మార్పులు, మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో ఉత్తిడి..

BP, Sugar: బీపీ, షుగర్‌ పెరిగిపోతోందా..? ఏం చేయాలి.. ప్రతి నలుగురిని ఈ రెండు జబ్బులు..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 22, 2021 | 8:59 PM

BP, Sugar: ప్రస్తుతమున్న కాలంలో జబ్బుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తినే ఆహారం, జీవన విధానంలో మార్పులు, మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో ఉత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల మానవుడు ఆరోగ్యం బారిన పడుతున్నాడు. మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది. జీవన విధానంలో మార్పుల చేసుకుంటే సుఖమయమైన జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక జీవన శైలి కారణంగా అనారోగ్య సమస్యలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్‌లు బారిన పడేవారు చాలా మందే ఉన్నారు. ఇంతకముందు పట్టణాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ జబ్బులు ఇప్పుడు పల్లెల్లోనూ వ్యాపిస్తున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్‌ ఉందంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు.ఇక గ్రామాల్లో 26 శాతం మంది, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులు, పల్లెల్లో 19 శాతం మంది, పట్టణాల్లో 24 శాతం షుగర్‌ బాధితులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఏపీ రాష్ట్రంలో 20.5 శాతం మంది షుగర్‌ బాధితులున్నారు. అయితే ఈ స్థాయిలో బీపీ, షుగర్‌ బాధితులుండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ రెండు ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేక వివిధ వ్యాధులు చుట్టుముడుతున్నాయి.

సరైన వ్యాయమం లేకనే..

ఒత్తిడి కారణంగా ఈ అనారోగ్య సమస్యలు దరి చేరుతున్నాయి. వ్యాయామం లేదు, సరైన ఆహారమూ తీసుకోవడం లేదు. పిల్లలు ఎలక్ట్రానిక్‌ పరికరాల ప్రభావానికి లోనవుతున్నారు. దీని నుంచి బయటపడాలంటే వారిని క్రీడల వైపు మళ్లించాలి. పెద్దవాళ్లు యోగా చేయాలి. శారీరక వ్యాయామం లేకుంటే చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పండ్లను ఎక్కువగా తీసుకోవడం మంచిది. ప్రతి రోజు వాకింగ్‌ అలవాటు చేసుకోవడం ఎంతో మంచిదంటున్నారు. మన జీవన శైలిలో మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచుకోవచ్చని, ఆస్పత్రుల చుట్టు తిరగాల్సిన అవసరం ఉండదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

ఇవీ కూడా చదవండి:

Diabetic Eye Disease: మీ కళ్లు మసకబారుతున్నాయా..? ఈ వ్యాధి కావచ్చు చెక్‌ చేసుకోండి..!

Oil Purify Test: చిన్న ప్రయోగంతో మీ వంటింట్లో ఉండే నూనెలో కల్తీ ఉందో..? లేదో..తెలుసుకోండిలా..?